ఇక ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లి ఓ చిన్న పల్లెటూరు. ఆ చుట్టుపక్కల వారిలో ఈ గ్రామం పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అక్కడ అచ్చయ్య అనే ఓ నాటు వైద్యుడు పాముకాటుకి నాటుకోడి వైద్యం చేసి చాలా మంది ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాడు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ పాము కాటుకి నాటు కోడితోనే వైద్యంని చేస్తున్నారు. వైద్యం వికటించిన దాఖలాలు అయితే ఇంతవరకు కనిపించలేదు. దీంతో ఆ ఊరి ప్రజలే కాదు ఆ చుట్టుపక్కల పది గ్రామాల వారు కూడా నాటుకోడి వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారు. ఇక పాము కరిచిన వ్యక్తికి ముందుగా గాయాన్ని గుర్తించి అక్కడ నాటు కోడి మలవిసర్జన ద్వారాన్ని కూడా అదిమి ఉంచుతారు. దీంతో మలద్వారం నుండి విషాన్ని పీల్చుకొని ఆ కోడి చనిపోతుంది. అలాగే అలా ఆ విషం పూర్తిగా తొలగిపోయే దాకా గాయం వద్ద వరుసగా నాటు కోళ్లు పెడుతూనేవుంటారు. ఎప్పుడైతే ఆ కోడి చనిపోవడం ఆగిపోతుందో అప్పుడు పూర్తిగా విషం తొలగి పోయినట్లు లెక్క. ఇలా పాము కరిచిన వ్యక్తి కోసం పాపం ఒక 10నుంచి 30 కోళ్ల వరకు చనిపోతూ ఉంటాయి. ఇక పాము కరిచిన వ్యక్తి ఆరోజు ఎటువంటి ఆహారం తీసుకోకుండా రాత్రి పూట నిద్ర పోకుండా మెలకువగా ఉండాలి. ఆ మరుసటిరోజు మధ్యాహ్నం భోజనం చేయాలి. ఇక ఇది నిబంధన. కొన్ని సందర్భాల్లో అయితే జిల్లేడు లేదా ఆకు పసరు ముక్కులోవేస్తారు దీంతో తుమ్ములు వచ్చి శరీరంలో రక్త ప్రసరణ జరిగి తొందరగా తగ్గుతుందట.



ఈ వైద్యం 30 సంవత్సరాల క్రితం గ్రామంలోని ఓ పాస్టర్ “అముక్తమాల్య”అనే గ్రంథంలో చూసి నేర్చుకోని ఆ గ్రామంలో వైద్యం చేయడం ప్రారంభించాడని, ఇక కోడి వైద్యంతో ఎవరు చనిపోక పోవడంతో గ్రామస్తులకు నమ్మకం ఏర్పడిందని అక్కడ చెబుతున్నారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు నాటుకోడి వైద్యంని చేయించుకుంటున్నారు.ఇక ఆ ఫాస్టర్ గ్రామంలోని ప్రేమానందం అనే వ్యక్తికి ఈ వైద్యంని నేర్పించాడు. ఇప్పుడు ఆయన కొడుకు అచ్చయ్య ఈ వైద్యంని చేస్తున్నాడు. ఆ నాటుకోడి వైద్యం ఎవరైనా నేర్చుకోవచ్చని నేర్చుకొని ఎవరికి వారు వైద్యం కూడా చేయవచ్చు అని ధీమాగా చెబుతున్నాడు అచ్చయ్య. ఇక్కడ పాముకాటుకు కూడా ఉచితంగా వైద్యం చేస్తుంటారు. అలాగే సంతోషంగా ఎవరైనా డబ్బులిస్తే తీసుకుంటారు. కానీ అక్కడ డిమాండ్‌ చేయటం అంటూ ఉండదు. నిజంగా ఈ వైద్యుడు చాలా గ్రేట్. ఈయన గురించి తెలిసిన వారు శభాష్ అని మేచ్చుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: