క్షేత్రస్ధాయిలో జరుగుతున్న డెవలప్మెంట్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణాలో  పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతు తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. ఇంతవరకు ఇలాంటి మాటలు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాత్రమే చెబుతున్నారు. అదికూడా ఎందుకు చెబుతున్నారంటే మిత్రపక్షాలైన బీజేపీ-జనసేనతో చంద్రబాబునాయుడు పొత్తుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది కాబట్టే.

వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసి ఇటు చంద్రబాబులో అటు పవన్ లో బాగా పేరుకుపోయింది. అయితే జగన్ను ఏ విధంగా ఓడించాలో మాత్రం ఇద్దరికీ అర్ధం కావటంలేదు. అందుకనే ఇద్దరు పొత్తులు పెట్టుకోవాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామనే పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. పొత్తులు పెట్టుకునే విషయంలో వీళ్ళద్దరి ఆలోచనలు అర్ధమైన తర్వాతే బీజేపీ చంద్రబాబుతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమనే స్టాండును వీర్రాజు పదే పదే చెబుతున్నారు. ఇపుడు పవన్ కూడా అదే రాగం మొదలుపెట్టారు. 


వీర్రాజు ప్రకటన విషయంపై ఇంతవరకు పవన్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీని పవన్ వదిలేసి చంద్రబాబుతో పొత్తుపెట్టుకుంటారనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే తెలంగాణాలో పర్యటించిన పవన్ మాట్లాడుతు తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు చంద్రబాబుతో పొత్తుకు రెడీ అవుతునే మరోవైపు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటే అర్ధమేంటి ?

తెరవెనుక ఏదో జరిగుంటుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పొత్తు విషయంలో పవన్ను బీజేపీ ఓవర్ పవర్ చేసుంటుందనే ప్రచారం మొదలైంది. బీజేపీ ఒత్తిడి కారణంగానే పవన్ ఇలాంటి ప్రకటన చేసుంటారని అనుకుంటున్నారు. మరి తాజా ప్రకటనకు పవన్ కట్టుబడుంటమే నిజమైతే చంద్రబాబుతో పొత్తుండకూడదు. ఎందుకంటే టీడీపీలో ఉన్నదే వారసత్వ రాజకీయాలు కాబట్టి. అసలు వారసత్వ రాజకీయాలు లేని ప్రాంతీయపార్టీ దేశంలోనే లేదు. సో పవన్ ప్రకటన తర్వాత బీజేపీ బాగా కంట్రోల్లో పెడుతున్నదా అనే డౌటు పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: