ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతులెత్తేసినట్లే. తెలంగాణాలో పర్యటించిన పవన్ చేసిన తాజా వ్యాఖ్య చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానమే వస్తోంది. పవన్ మీడియాతో మాట్లాడుతు ఏపీలోనే అధికారం ఆశించటంలేదని ఇక తెలంగాణాలో ఏమి ఆశిస్తానన్నారు. పవన్ తాజా వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్వయంగా పవన్ మాటల్లోనే తేలిపోయింది.






నిన్నమొన్నటివరకు పవన్ ఎక్కడ మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా దాటదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేనే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం అంటే ఏమిటి ? అధికారంలోకి వచ్చేస్తున్నామనే కదా. ఎన్నికలు జరగటమే ఆలస్యం ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రాబోయేది జనసేనే అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. మరలాంటిది హఠాత్తుగా ఏమైందో అర్ధం కావటంలేదు.






తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పటంలో తప్పేమీలేదు. కానీ ఏపీలో కూడా అధికారంలోనే అధికారం ఆశించటంలేదని చెప్పటమంటే తెరవెనుక ఏదో పెద్ద విషయమే నడిచుండాలి. చంద్రబాబునాయుడుతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలన్న పవన్ ఉత్సాహంపై బీజేపీ నీళ్ళు చల్లుండాలి. బాదాడే బాదుడు కార్యక్రమంలో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉందని తాము ఒంటరిగా పోటీచేసినా అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే భ్రమల్లో చంద్రబాబును ఎల్లోమీడియా ముంచేస్తోంది. ఈ భ్రమలోనే ఒంటరిపోటీకి చంద్రబాబు రెడీ అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.






ఎందుకంటే జనసేనతో పొత్తుండాలంటే పవన్నే సీఎం అభ్యర్ధిగా ఎన్నికలకు ముందే ప్రకటించాలని జనసేన నేతలు టీడీపీ నేతలకు స్పష్టంచేశారని  ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే అయితే సీఎం అభ్యర్ధిగా పవన్ను ప్రకటించటం సాధ్యంకాదని టీడీపీ నేతల నుండి సమాధానం వచ్చుండాలి. ఎందుకంటే తాము ఈసారి ఎవరి పల్లకి మోయటానికి సిద్ధంగా లేమని ఇంతకుముందే పవన్ స్పష్టంగా ప్రకటించారు. దీంతో జనసేనతో పొత్తు విషయంలో టీడీపీ వెనకడుగు వేసిందేమో. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కష్టమని పవన్ కు అర్ధమైపోయుంటుంది. అందుకనే ఏపీలో కూడా అధికారాన్ని ఆశించటంలేదని చెప్పారా ?



మరింత సమాచారం తెలుసుకోండి: