ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు గురించి అప్పుడెప్పుడో తెలంగాణా సీఎం కేసీయార్ ఒకమాటన్నారు. ఏదో సందర్భంలో కేసీయార్ మాట్లాడుతు ‘దేశంలోనే చంద్రబాబు అంత డర్టియెస్ట్ పొలిటీషియన్ లేరు’ అని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు విన్నతర్వాత ఆ మాటలు నిజమే అనిపిస్తునా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు రెండు మూడు ఉదాహరణలను చూస్తే ఈ అనుమానాలు మరింత పెరిగిపోతాయి.





ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం మొదలుపెట్టిందే చంద్రబాబు, ఎల్లోమీడియా. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతు రాష్ట్రంలో తొందరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్నారు. అసలు ప్రచారాన్ని మొదలుపెట్టిందే చంద్రబాబు+ఎల్లోమీడియా అయితే మళ్ళీ ప్రచారం జరుగుతోందనటంలో అర్ధమేలేదు. ఒకవైపు చంద్రబాబే ప్రచారం చేస్తు ఇపుడు తనకు పరిపాలించే సత్తాలేదని తెలిసిపోయింది కాబట్టే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తేల్చేశారు. అసలు చంద్రబాబు మాటలకు, ఆరోపణలకు ఏమాత్రం పొంతన ఉండటమే లేదు. 





రాష్ట్రాన్ని ఐదేళ్ళుపాలించే దమ్ము, సత్తా జగన్ కు లేదని తేలిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల గురించి ఇప్పటివరకు జగన్ ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పిందీ చంద్రబాబే. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కారణంగా తనలో ఐదేళ్ళు పాలించే సత్తాలేదని జగన్ కు అర్ధమైందని చెబుతున్నదీ చంద్రబాబే. అంటే ఆరోపణలు చేసేదీ చంద్రబాబే, ముద్రేసేదీ చంద్రబాబే, బురదచల్లుతు దుష్ప్రచారం చేయించేదీ చంద్రబాబే.






మొత్తానికి చంద్రబాబులో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ అందరికీ స్పష్టంగా అర్ధమైపోతోంది. సంక్షేమపథకాలు అమలవుతుండటం, బీసీలకు పెద్దపీట వేస్తుండటం, ఎంత ప్రయత్నించినా, ఎన్ని జాకీలు వేస్తున్నా టీడీపీ ఇమేజి పైకి లేవలేకపోతుండటం లాంటివి చూస్తు చంద్రబాబులో జగన్ పై కసి పెరిగిపోతున్నట్లుంది. అందుకనే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. తాను ఏమి మాట్లాడినా ప్రముఖంగా అచ్చేసే ఎల్లోమీడియా ఉందికాబట్టే చంద్రబాబు ఆటలు హ్యాపీగా సాగిపోతున్నాయి. ఎంతకాలం ఇలా సాగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: