దేశంలోనే అత్యధకంగా ఏపిలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనిటీడీపీ నేత నారా లోకేశ్‌ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇకనైనా బాదుడే బాదుడిని ఇక‌నైనా ఆపాలంటూ సీఎం జగన్ రెడ్డి కి టీడీపీ నేత నారా లోకేశ్‌  బ‌హిరంగ లేఖ రాశారు. కేంద్రం, ఇత‌ర రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై భారాలు త‌గ్గిస్తుంటే, ఏపీలో ఒక్కసారి కూడా త‌గ్గించ‌లేదని టీడీపీ నేత నారా లోకేశ్‌  గుర్తు చేశారు. పెంచకపోగా మ‌రింత‌గా ప‌న్నులు పెంచిన స‌ర్కారు త‌క్షణ‌మే రేట్లు త‌గ్గించాలని టీడీపీ నేత నారా లోకేశ్‌  డిమాండ్ చేశారు.


కేంద్ర ప్రభుత్వం రెండు విడ‌త‌ల్లో పెట్రోల్ డీజిల్ ల‌పై ప‌న్నులు త‌గ్గించిందని..  ఆ మేర‌కు వాటి ధ‌ర‌లు త‌గ్గేలా నిర్ణయం తీసుకుందని టీడీపీ నేత నారా లోకేశ్‌  తెలిపారు. కేంద్రంతోపాటు 23 రాష్ట్రాలు కూడా తమ పన్నుల‌ని త‌గ్గించుకుని పెట్రోల్‌, డీజిల్  భారాన్ని తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాయని.. కానీ ఏపీ సీఎం నుంచి స్పంద‌న శూన్యం అని టీడీపీ నేత నారా లోకేశ్‌  విమర్శించారు.


ఏపీలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌లేదు స‌రిక‌దా, పెంచుకుంటే త‌ప్పేంటంటూ కోట్ల రూపాయ‌లతో దొంగ లెక్కల‌తో సొంత ప‌త్రిక‌ల‌కు  ప్రకటనలు ఇచ్చుకోవ‌డం సీఎం జగన్‌కే చెల్లిందని టీడీపీ నేత నారా లోకేశ్‌  మండిపడ్డారు. టిడిపి హయాంలో ప్రజల పై పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ ని రూ.2కి తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ మాత్రం మూడేళ్లలో ఒక్క పైసా త‌గ్గించ‌డం మాట అటుంచి పెంచుకుంటూ పోయారని టీడీపీ నేత నారా లోకేశ్‌  లేఖలో తెలిపారు.


దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ‌గా పెట్రోల్‌పై మీ స‌ర్కారే 31 శాతం వ్యాట్  విధిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్‌  గుర్తు చేశారు.  వీటికి తోడు అద‌న‌పు వ్యాట్ అంటూ లీట‌ర్ పెట్రోల్‌ఫై 4 రూపాయలు బాదుతున్నారని.. రోడ్డు సెస్ 1 రూపాయి వేసి దేశంలోనే అతి ఎక్కువ‌గా పెట్రోల్ ధ‌ర ఏపీలోనే అమ్ముతూ సామాన్యులన్ని జగన్ దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్‌  విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: