ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు జనాల్లో పెద్దగా విశ్వసనీయతలేదు. అధికారంలోకి రావటం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చేయటం, తర్వాత వాటిని మరచిపోవటం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల్లో కూడా ఇదే విషయం బయటపడింది. అందుకనే 2019 ఎన్నికల్లో జనాలు టీడీపీని ఘోరంగా ఓడగొట్టింది. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పూరాలేదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు.






ఒంటిరిగా పోటీచేసేంత ధైర్యం లేకపోవటంతో పొత్తుల కోసం తెగ ఆరాటపడుతున్నారు. పొత్తులంటేనే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్నిసీట్లు పోటీచేయాలి, ఏఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీచేయాలనే విషయాన్ని ఫైనల్ చేసుకోవటం. తర్వాత పొత్తుధర్మానికి కట్టుబడి నడుచుకోవటం పొత్తుల్లోని పార్టీల ధర్మం. కానీ చంద్రబాబు దగ్గర పొత్తుల ధర్మం పనిచేయదు. పొత్తుల్లో నిర్ణయమయ్యేది ఒకటి, ఆచరణలో జరిగేదొకటి, ఎన్నికల్లో పోటీ మరోకటిగా ఉంటుంది.






ఒకవైపు జనసేనతో పొత్తుకు రెడీ అయిపోతు మరోవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను ప్రకటించేస్తున్నారు. పుంగనూరులో చల్లాబాబు, పులివెందులలో బీటెక్ రవి, డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డిని బహిరంగంగా ప్రకటించేశారు. నేతల సమీక్షల్లో డిసైడ్ చేసిన అభ్యర్ధుల జాబితా ఇంకా చాలావుంది. ఒకవైపు పొత్తులకు పొత్తులకు ప్రయత్నిస్తునే మరోవైపు అభ్యర్ధులను డిసైడ్ చేయటం, ప్రకటించేయటం చంద్రబాబుకే చెల్లింది.






ఇలాంటి వైఖరి వల్లే చంద్రబాబును ఏ పార్టీకూడా నమ్మటంలేదు. 2014లో కూడా బీజేపీతో పొత్తులో 15 సీట్లిచ్చారు. అందులో మళ్ళీ ఐదారు చోట్ల ఫ్రెండ్లీ కంటెస్టన్నారు. మరో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్సే పోటీచేశారు. చివరకు బీజేపీ గెలిచింది నాలుగు చోట్లమాత్రమే. తర్వాత కాకినాడ కొర్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. చంద్రబాబు నైజం కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జ్ఞానోదయం అయినట్లులేదు. ఇందుకే బీజేపీ మాత్రం దూరంగా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: