ఒకప్పుడు భారత్ లో కాశ్మీర్  భూభాగమని కేవలం చెప్పుకునే వారు మాత్రమే. కానీ అఫీషియల్గా మాత్రం ఇక్కడ ప్రభుత్వం తో గాని ఇక్కడ జెండాతో గాని కాశ్మీర్ ప్రాంతానికి అసలు సంబంధం ఉండేది కాదు. అంతేకాకుండా భారత్ నుంచి కాశ్మీర్ కు రాకపోకలు కూడా ఉండేవి కాదు అనే చెప్పాలి. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన 370 ఆర్టికల్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్కడ పాలన మొత్తం ఎంతో భిన్నంగా ఉంది. కానీ పాలకులు మారిన అక్కడ పరిస్థితులను మార్చేందుకు మాత్రం ఎవరూ ప్రయత్నించలేదు. ఒకవేళ పరిస్థితులు మార్చేందుకు ప్రయత్నిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అని భయపడిపోయారు.


 కానీ కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్లో అమలులో ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేస్తూ కాశ్మీర్ భూభాగాన్ని భారత్ లో అఫీషియల్గా కలిపేసింది. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ఎన్నో రోజుల పాటు సైనికులను ఉంచింది. ఇప్పుడు కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇన్ని రోజుల వరకు అభివృద్ధికి నోచుకోని కాశ్మీర్లో ఇప్పుడు మాత్రం అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పాలి.


 మరీ ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలోకి అటు పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అంతే కాదు అక్కడ మెడికల్ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలు విపరీతంగా పుట్టుకొస్తోన్నాయి. అక్కడ అప్షన్ ఎంచుకుని మరి విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఇక కాశ్మీర్ ప్రాంతంలో పోలీసులు విపరీతంగా పెరిగిపోయాయ్. గత ఏడాది  వరకు చూసుకుంటే ఒక లక్ష రెండు వేల మంది టూరిస్టులు వచ్చారు. ఈ ఏడాది మాత్రం ఏకంగా అధికంగా 5 లక్షల మంది టూరిస్టులు కాశ్మీర్ లోకి రావడం గమనార్హం. ఇది కాశ్మీర్ లో ఒక అద్భుతం అని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: