రష్యా-ఉక్రెయిన్ ల మధ్య జరిగిన వార్ కారణంగా అన్నీ వస్తువుల పై ధరలు భారీగా పైకి కదిలాయి.చిన్న వస్తువుల నుంచి వంట గ్యాస్ వరకూ అన్నిటి పై ప్రభుత్వం ధరలను భారీగా పెంచింది.నిత్యావసర ధరలు అయితే మండి పోతున్నాయి..ఎండలు పెరిగే కొద్ది కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.మొన్నటి వరకూ ఉల్లి ధరలు మండి పోయాయి.ఇప్పుడు మాత్రం టమోటా ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి.మొన్నటివరకు వరకూ ఐదు, పది వరకూ ఉన్న ధరలు నేడు మార్కెట్ లో సెంచరి దాటేసింది.ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 120 వరకూ పలుకుతుంది.


మార్కెట్‌లో టమోటాల ధర ఆకాశాన్నంటుతోంది. బహిరంగ మార్కెట్లో నాణ్యత కలిగిన టమోటా కాయలు కిలో రూ.100 పలికింది.దీంతో కొనలేక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రెండురోజుల వరకూ రూ.90 నుంచి రూ.80 మధ్య పలికిన ధర సోమవారం రూ.100కు చేరుకుంది. సోమవారం సామర్లకోట, పెద్దాపురం మార్కెట్లలో 15కిలోల బాక్స్‌ టమోటాల ధర గరిష్ఠంగా రూ.1150 వరకూ పలికింది. నాణ్యతను బట్టి బాక్స్‌ టమోటాలను రూ.900 నుంచి రూ.1150 వరకూ వ్యాపారులు కొనుగోలు చేశారు..

ఇకపోతే..తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మండుటెండలు, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా దిగుబడులు తగ్గడం, ధరలు పెరుగుదలకు కారణమయ్యాయని వ్యాపారులు చెబుతున్నారు. అధిక ధర వెచ్చించి కొనుగోలు చేయడం, రవాణా ఛార్జీలు అధికం కావడం తదితర కారణాలవల్ల స్థానికంగా వీటిని ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తోందని వారు అంటున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలు ఉండడంతో అధిక ధర అయినా తప్పనిసరిగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. నెలరోజులుగా ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ధర బాగా ఉండడంతో రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. పెట్టుబడులు పోయి ఎకరానికి రూ.2లక్షల ఆదాయం వస్తుందని రైతన్నలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి ధరలు మార్కెట్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. మరోవారం వరకూ ధరలు భారీగా పెరుగుతాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: