లాజిక్ కొత్తగా ఉన్నా ఇందులో వాస్తవం ఉందనే అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలిచినా అంతిమంగా జైకొట్టేది మాత్రం కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ కే అన్న విషయం చూస్తునే ఉన్నాం. తమిళనాడులోని డీఎంకే ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీస్తున్నారు. మహారాష్ట్ర ఎంపీలు, పశ్చిమబెంగాల్లో తృణమూల్ ఎంపీలు, ఒడిస్సాలో బీజూ జనతాదళ్ ఎంపీలు నరేంద్రమోడి సర్కార్ ను నిలదీస్తున్నారు.





అంటే కేంద్రప్రభుత్వం తమరాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయాలకు తీసుకున్నది అనుకున్నపుడు ఆయా రాష్ట్రాల ఎంపీలు పార్లమెంటులో మోడిని గట్టిగా నిలదీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అనేక రూపాల్లో పార్లమెంటులోను, బయటా నిరసనలు తెలియజేసిన విషయం అందరు చూస్తున్నదే. కానీ ఏపీ విషయంలో మాత్రం ఇలాంటి ఘటనలను జనాలు అస్సలు ఊహించలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అందరు మోడికి సాగిలిపడుతున్న వాళ్ళే.





కేంద్రానికి సాగిలపడటం అనేదరిద్రం మొదలైంది చంద్రబాబుతోనే. తన అవసరాల కోసం ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం నిర్మాణానికి నిధులను ఇచ్చేదిలేదని కేంద్రం తెగేసిచెప్పినా చంద్రబాబు నోరెత్తలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కేంద్రాన్ని ఏమీ అనకుండా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేశారు. అంటే కేంద్రంతో జగన్ అవసరాలు చాలాఉన్నాయి కాబట్టే. అలాగే ఇపుడు జగన్ అధికారంలో ఉన్నపుడు కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తున్నా జగన్ నోరెత్తలేకపోతున్నారు.





విచిత్రం ఏమిటంటే ఏపీకి వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు జగన్నే చంద్రబాబు బాధ్యులను చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంతపాడుతున్నారు. అంటే రేపటి ఎన్నికల్లో పై మూడుపార్టీల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచినా మొత్తం 25 మంది ఎంపీలు కేంద్రానికి జై కొట్టడం ఖాయమే. అందుకనే పరోక్షంగా 25 మంది ఎంపీలు బీజేపీ ఖాతాలో ఉన్నట్లే అని అర్ధమవుతోంది. కాబట్టి ఎంపీ సీట్లలో గెలుపుకోసం బీజేపీ పెద్దగా శ్రమపడాల్సిన అవసరంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: