తాజాగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో అనేక రకాల విమర్శలు వెల్లువుత్తుతున్నాయి.ఇక ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తుందన్న కారణంతో వృద్ధ డ్రైవర్ పై దాష్టికానికి దిగాడు. ఆయన మత్తులో ఉన్నాడు.. ఆపై వయసులో పెద్ద వాడు ఇంకా వృద్ధుడని కూడా చూడకుండా షూ వేసుకున్న కళ్ళతో పాపం ఆయన్ని పదే పదే తన్నాడు. ఇదంతా కూడా అక్కడే ఉన్న ఓ యువకుడు మొబైల్ ద్వారా చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ మొబైల్ లో తీసిన వీడియో ఇప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఫార్వర్డ్ అవుతూ. సామజిక మాధ్యమాలలో ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఇలా చేసిన ఆ కానిస్టేబుల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు.ఇక ఇంతకీ ఘటన ఎక్కడ జరిగిందంటే? తిరుపతిలో కిషోర్ నాయుడు అనే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. ఇక మద్యం మత్తులో ఉన్న ఒక వృద్ధుడిపై తన ప్రతాపం చూపించాడు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నాడన్న కారణంతో చెప్పాల్సిన విధంగా చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు పదే పదే విచక్షణ రహితంగా కాళ్లతో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు.



ఇక నిన్న సాయంత్రం అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో సిమెంట్ లోడ్ తో ఓ లారీ వచ్చింది.. అక్కడ ట్రాఫీక్ కు అంతరాయం కలుగుతుందని, లారీని అక్కడ నుంచి తీయాలని ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పాడు. అయితే ఇక ఎలాంటి ఇబ్బందిలేదని లారీలో వచ్చిన ఓ వ్యక్తి పోలీసుతో వాగ్వాదంకు దిగ్గాడు.. దీంతో ఇద్దరూ కూడా ఒకరిని ఒకరూ తోసుకున్నారు.ఇక దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ ఆ వ్యక్తిని కాలితో తన్నుతూ చాలా దురుసుతనంగా ప్రవర్తించిన ఘటన ప్రక్కనే ఉన్న కొందరూ వీడియో తీసి సోషియల్ మీడియాలో పోస్టు చేశారు.. ఇక ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే అవసరమైతే అందుకు తగ్గట్టు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.. మరీ అవసరమైతే ఆ సమీపంలోని బ్లూ కోర్ట్స్ సిబ్బందిని పిలిచి అరెస్టు కూడా చేయొచ్చు.. అంతే తప్పా ప్రజలపైన నేరుగా ఇలా దాడికి దిగడం ఇంకా అది కూడా విచక్షణ మరచి ఇంత దారుణంగా వ్యవహరించడం ఎంత వరకు కరెక్టో పోలీసులే ఒక్కసారి ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: