క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ వేసిన ఒక పిటీషన్ పై కోర్టు మండిపడింది. ప్రభుత్వం నిర్ణయంపై స్టే ఇవ్వాలంటు ఎంపీ వేసిన పిటీషన్ను కోర్టు కొట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే చింతామణి నాటకంలో వైశ్యులను కించపరుస్తున్నారంటు ఆర్యవైశ్య సంఘంలోని ప్రముఖులు జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ నాటకాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సరే వైశ్య ప్రముఖులంతా వచ్చి అడిగారు కాబట్టి ప్రభుత్వం కూడా నాటకాన్ని నిషేధించింది.

ఇంకేముంది వెంటనే ఎంపీ ప్రభుత్వంపై కోర్టులో కేసువేశారు. నాటకాన్ని బ్యాన్ చేయటంవల్ల ఎంతోమందికి ఉపాధిపోతోందని తెగ బాధపడిపోయారు. నిజానికి రాష్ట్రంలో నాటకలు వేస్తున్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళసంఖ్యే చాలా తక్కువ. ఈ నేపధ్యంలోనే చింతామణి నాటకంపై బ్యాన్ పెట్టినంతమాత్రాన ఎవరి ఉపాధిని ప్రభుత్వం పోగొట్టినట్లు కాదు. ఈ కేసును విచారించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వటానికి అంగీకరించలేదు. కాకపోతే కేసు విచారణ జరుగుతుందని మాత్రం చెప్పింది.

ఇంతకుముందు మద్యంపై వచ్చిన ఆదాయాన్ని కార్పొరేషన్ కు మళ్ళించి అప్పు తీసుకుంటుందని ఎంపీ కేసువేశారు. దాన్నికూడా కోర్టు కొట్టేసింది. మద్యం ఆదాయాన్ని, కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకునే విషయంలో ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని చెప్పేసింది. కేసు వేయటంలో పిటీషనర్ ఇంట్రస్టు ఏమిటని నిలదీసింది. అందుకుముందు అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కేసు వేశారు. ఈ కేసును కూడా కోర్టు కొట్టేసింది.


అంతకుముందు విచారణ పేరుతో తనను హింసించారు కాబట్టి జగన్ తో పాటు సీఐడీ ఉన్నతాధికారులపై యాక్షన్ తీసుకోవాలంటు ఢిల్లీ పోలీసుస్టేషన్లోను, సభా హక్కుల ఉల్లంఘన కమిటికి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదును కూడా కమిటి కొట్టేసింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కోర్టులో కేసువేసి అడ్డుకోవాలన్నదే టార్గెట్ గా ఎంపీ కేసులు వేస్తున్నారు. అయితే ఏ కేసులోను ఎంపీకి అనుకూలంగా తీర్పులు రావటంలేదు. చూస్తుంటే జగన్ మీద కోపాన్ని తీర్చుకోవటానికి ఎంపీ కోర్టులను వేదికగా చేసుకుంటున్నట్లు అర్ధమైనట్లుంది.మరింత సమాచారం తెలుసుకోండి: