గత ఎన్నికల వరకు పెద్దగా కనిపించని ఈ పద్దతి రేపటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించబోతోంది. ఓటర్లలో స్పష్టమైన విభజన ఇపుడే కనబడుతోంది. ఓటర్లలో అర్బన్ ఓటర్లు, రూరల్ ఓటర్లు అనే చీలిక వచ్చేసింది. మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లను రూరల్ ఓటర్లని, పట్టణాలు, నగరాల్లో ఉండే ఓటర్లను అర్బన్ ఓటర్లని అనటం చాలా సహజం. కానీ ఇపుడు రూరల్-అర్బన్ అనే పద్దతిలో ఓటర్లలో డివిజన్ ఎందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరే దీనికి కారణం.





మొన్నటి ఎన్నికల వరకు ఏ ప్రాంతంలో ఓటింగ్ శాతం ఎక్కువ జరిగిందనే విషయాన్ని మాత్రమే అందరు చూసేవాళ్ళు. కానీ మొదటిసారి జగన్ పాలన మూడేళ్ళ తర్వాత మాత్రమే ఓటర్లలో అర్బన్-రూరల్ అనే స్పష్టమై విభజన వచ్చేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే రూరల్ ఓటర్లలో ఎక్కువగా కనీస సౌకర్యాలు, సంక్షేమపథకాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. ఇదే సమయంలో అర్బన్ ఓటర్లలో ఎక్కువగా మౌళికసదుపాయాలు, పథకాల అమలుపై దృష్టిపెట్టారు.





మామూలుగా రూరల్ ప్రాంతాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటారు కాబట్టి సహజంగానే ఓటర్లు కూడా రూరల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటారు. దీనికి విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలుంటాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ ప్రాంతం ఓటర్లు ఓటింగ్ కు ఎక్కువగా వస్తారు ? ఏ అంశాలు వాళ్ళని బాగా ప్రభావితం చేస్తాయనేది చాలా కీలకమైపోయింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సుమారు 60 నియోజకవర్గాలు మాత్రమే పట్టణ, నగరాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 115 నియోజకవర్గాలు రూరల్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.





ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు చంద్రబాబునాయుడు ఇంకోవైపు పవన్ కల్యాణ్ ముగ్గురు కూడా ఇటు రూరల్ అటు అర్బన్ ప్రాంతాల్లో ఓటర్లను ఆకర్షించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే జగన్ అయినా చంద్రబాబు అయినా ఇపుడు రూరల్ ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు. వచ్చే విజయదశమి నుండి ప్రారంభమయ్యే పవన్ బస్సుయాత్ర కూడా ఎక్కువభాగం రూరల్ ప్రాంతాలపైనే దృష్టి పెట్టబోతోందని సమాచారం. మరి ఏ ప్రాంతం ఓటర్లు ఎక్కువగా ఎవరిని కరుణిస్తారో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: