ఇటీవల సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు తీవ్రతరం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా పోస్టింగ్ లతో విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సెటైరికల్ పోస్ట్ టీడీపీ వారికి రివర్స్ అయ్యేలా ఉంది. దానిపై ఆర్టీసీ వివరణ.. టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముంది..? ఇంతకీ టీడీపీ కామెంట్ ఏంటి..? దానికి ఆర్టీసీ రియాక్షన్ ఏంటి..? మీరే చదవండి..

ఈ ఫొటోలో కనపడే బస్సుపై టార్పలిన్ పట్ట కప్పి ఉంది. ఆ బస్సు ఫొటోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి.. జగన్ హయాంలో ఆర్టీసీ ఎలా ఉందో చూడండి అంటూ టీడీపీ విభాగం కామెంట్ చేసింది. వైసీపీ పాలనలో ఆర్టీసీ అధ్వాన్నంగా ఉందని, ఆర్టీసీ బస్సులు అధ్వాన్నంగా తయారయ్యాయని.. చివరకు టార్పలిన్లు కప్పి బస్సుల్ని నడిపించాల్సిన పరిస్థితి ఉందని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇక చూస్కోండి.. దీనిపై టీడీపీ కార్యకర్తలనుంచి రకరకాల కామెంట్లు వచ్చాయి. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేలా వారు కామెంట్లు చేశారు. కానీ అసలు నిజం అది కాదు. బస్సు పరిస్థితి బాగోలేక దానిపై టార్పాలిన్ కప్పలేదు. ఇంతకీ ఏంటా నిజం..

టీడీపీ కామెంట్లకు ఏపీ ఎస్ఆర్టీసీ వెంటనే వివరణ ఇచ్చింది. కాస్త ఘాటుగానే టీడీపీ సోషల్ మీడియా వింగ్ కి బదులిచ్చింది.  బస్సుకు టార్పాలిన్ ఎందుకు కప్పారో, టార్పాలిన్ కప్పి ఆ బస్సుని ఎందుకు తీసుకెళ్తున్నారో చెబుతూ.. ఏపీఎస్ఆర్టీసీ వివరణ ఇచ్చింది. తెలుగుదేశం పొలిటికల్ వింగ్ అనే పేరు ప్రస్తావిస్తూ.. మీరు పోస్టు చేసిన బస్సులో ప్యాసింజర్లు లేరు అని తేల్చి చెప్పింది. ఇంతకీ ప్యాసింజర్లు లేకపోతే అందులో ఎవరున్నట్టు.. ఆ బస్సుకి ఎందుకు టార్పాలిన్ కట్టినట్టు..?

అది స్కూల్ బుక్స్ రవాణా చేస్తున్న బస్సు. విద్యా శాఖతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్టీసీ తమ బస్సుల్లో పుస్తకాలను ఆయా జిల్లాలకు రవాణా చేస్తోంది. ఏపీలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కాకమునుపే ఈ పని పూర్తి కావాల్సి ఉంది. దీంతో జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా స్కూల్స్ కి పుస్తకాల బట్వాడా బస్సుల్లో మొదలైంది. రాజమండ్రి నుంచి బస్సుల్లో పుస్తకాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యలో వర్షం, ఇతర ఇబ్బందులు ఎదురు కాకుండా బస్సులపై టార్పాలిన్ పట్ట కప్పారు. దాన్ని టీడీపీ వాళ్లు తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా.. తప్పుడు పోస్టింగ్ పెట్టారంటూ ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ సలహా తీసుకుని టీడీపీ సోషల్ మీడియా వింగ్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: