ఇటీవలి కాలంలో పుట్టిన రోజులను సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం సంపన్నులు మాత్రమే కాదు సామాన్యులు సైతం తమకు ఉన్నంతలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే సాధారణంగా ఇలా పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సమయంలో తన ప్రియమైన వారికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలి అని భావిస్తూ ఉంటారు స్నేహితులు, బంధువులు. ఇక ఇలాగే భర్త భార్య కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా సరి కొత్తగా ఆలోచించి ఊహించని గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పటివరకూ భార్య పుట్టినరోజు వేడుకలు జరిగిన సమయంలో భర్త ఖరీదైన చీర లేదా ఖరీదైన ఆభరణం లాంటిది గిఫ్ట్ గా ఇవ్వడం చూశాము. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఎవరు ఊహించని గిఫ్ట్ ఇచ్చి భార్యతో పాటు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏకంగా తన భార్య పుట్టినరోజు నాడు ఇచ్చే బహుమతి ఎంతో స్పెషల్ గా ఉండాలని భావించి ఒక ఎకరా స్థలం కొనిచ్చాడు.


 ఇందులో కొత్తేముంది ఇటీవల కాలంలో ఎంతోమంది ఇలాంటివి చేస్తున్నారు కదా అని అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే పొరబడినట్లే.. ఎందుకంటే ఇక్కడ భర్త భార్యకు బహుమతిగా ఇచ్చిన ఎకరం స్థలం భూమిపై కాదు ఏకంగా చంద్రుడిపై. మధ్యప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీష్ మహాజన్ తన భార్య కోసం చంద్రుడిపై ఎకరాల స్థలం కొని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ సొసైటీకి అప్లై చేసుకున్న తర్వాత హరీష్ మహాజన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. గతంలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక బిజినెస్ మేన్ కూడా తన కుమారుని బర్తడే కి చంద్రుడిపై స్థలం కొన్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: