ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పరిస్ధితేమిటో  ఏమిటో తొందరలోనే తేలిపోతుంది. నరేంద్రమోడి దృష్టిలో చంద్రబాబు స్ధానమేంటనేది బయటపడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్డీయే  రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తున్నారు. తన అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వమని రిక్వెస్టు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. సరే ఆమె రావటం, మద్దతు అడగటం, జగన్ మద్దతు ఇవ్వటం అంతా కేవలం లాంఛనమే.





ఎందుకంటే ఇప్పటిక ముర్ముకు జగన్ మద్దతు ప్రకటించేశారు. అలాగే ఆమె నామినేషన్ వేసినపుడు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఆమెతోనే ఉన్నారు. కాబట్టి ప్రత్యేకించి ఏపికి వచ్చి మద్దతు అడగాల్సిన అవసరం లేకపోయినా ఏదో మర్యాద కోసమని వస్తున్నారంతే. మరి ఏపీకి వస్తున్న ముర్ము తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుస్తారా ?





ఈ విషయంలో క్లారిటిలేదు. నిజానికి చంద్రబాబును కలిసి మద్దతు అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే టీడీపీకి ఉన్న ఓట్ల విలువ చాలా చాలా తక్కువ. ముర్ముకు మద్దతుగా టీడీపీ ఓట్లేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. ముర్ముకు గెలుపుకు అవసరమైన ఓట్లకన్నా ఎన్డీయేకి ఎక్కువే ఉంది కాబట్టి ప్రత్యేకించి ఎవరి మద్దతు అవసరంలేదిక. అయితే నరేంద్రమోడి ఆంతరంగం ఏమిటనే విషయం బయటపడుతుంది. మద్దతు కోసం ముర్ము ఎవరిని కలవాలనేది డిసైడ్ చేసేది మోడియే.





ఏపీ పర్యటనలో జగన్ తో పాటు చంద్రబాబును కూడా ముర్ము కలిస్తే మోడీ కాస్త సానుకూలంగా ఉన్నారనే అనుకోవాలి. అలాకాకుండా జగన్ను మాత్రమే కలిసి వెళ్ళిపోతే బీజేపీ వైపునుండి చంద్రబాబుకు శాస్వతంగా తలుపులు మూసుకుపోయినట్లే. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించాలంటే జనసేన+బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒకపుడు చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు. అయితే తాజా పరిణామాల్లో పొత్తు గురించి మాట్లాడటంలేదు. కానీ ఏదైనా తేడా వస్తోందని అనిపిస్తే మాత్రం మళ్ళీ పొత్తుకు వెంపర్లాడటం ఖాయం. మరపుడు బీజేపీ ఏమి చేస్తుందనేందుకు తొందరలోనే సమాధానం దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: