వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు భయపడినంతా జరిగింది. ఎంపీపై రాజద్రోహం కేసుతో పాటు అనేక ఇతర కేసులను సీఐడీ పోలీసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదుచేశారు కాబట్టి విచారణపై స్టే ఇవ్వాలని ఎంపీ హైకోర్టులో కేసు వేశారు. ఒకసారి విచారణపేరుతో తనను అదుపులోకి తీసుకుని చచ్చేట్లు కొట్టారంటు అప్పట్లో రఘురామ నానా గోలచేసిన విషయం తెలిసిందే.

సీఐడీ తనను చావగొట్టారంటు సికింద్రాబాద్ లోని మిలిట్రీ ఆసుపత్రిలో చేరి కట్లు కట్టించుకుని ఢిల్లీకి అలాగే వెళ్ళిపోయారు. అక్కడ కూడా చాలామంది మంత్రులు, లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి కూడా కట్లతోనే వెళ్ళారు. మొత్తానికి అప్పట్లో ఎంపీ చాలా పెద్ద సీనే క్రియేట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి, సీఐడీ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఎంత సీన్ క్రియేట్ చేసినా ఉపయోగం లేకపోయింది. దాంతో విచారణ నుండి రక్షణపొందేందుకు ఎంపీ హైకోర్టులో కేసు వేశారు.

ఆ కేసును విచారించిన హైకోర్టు రాజద్రోహం కేసును విచారించవద్దని సీఐడీ పోలీసులకు స్పష్టంగా ఆదేశించింది. రాజద్రోహం కేసు మినహా మిగిలిన అన్నీ కేసులను విచారించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాకపోతే లాయర్ సమక్షంలోనే ఎంపీని విచారించాలనే కండీషన్ పెట్టింది. ఎంపీ ఆరోపణలు చేస్తున్నట్లు తాము విచారణలో కొట్టలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనను కొట్టారని ఎంపీ, కొట్టలేదని పోలీసులు ఎవరి వాదనలకు వాళ్ళు కట్టుబడున్నారు. దాంతో నిజమేంటనేది పూర్తిగా బయటకు రాలేదు.

సరే పోలీసులు ఎంపీని చావగొట్టింది నిజమే అని అనుకుందాం. మరీసారి విచారణలో ఏమి జరుగుతుందో చూడాలి. ఎందుకంటే పోలీసులు తలచుకుంటే ఎంపీని కొట్టడం పెద్ద కష్టమేమీకాదు. అందుకనే తనను విచారించేటపుడు లాయర్ పక్కనే ఉండాలని కోరారు. కోర్టుకూడా సరే అని ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకే విచారించాలని చెప్పింది. హైదరాబాద్ లోనే దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారించాలని ఆదేశించింది. మరీసారి విచారణలో ఏమి జరుగుతుందో అని ఎంపీలో టెన్షన్ పెరిగిపోతుండటం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: