పరీక్షలు వచ్చాయంటే చాలు అప్పటి వరకు అసలు చదువంటే ఆసక్తి చూపని విద్యార్థులు కూడా పుస్తకాల పురుగుల్లా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పరీక్షలకు కొన్ని రోజుల ముందు నుంచే అన్ని సబ్జెక్టులు చదివేయాలని టార్గెట్ పెట్టుకొని ఇక ఒక్క నిమిషం పాటు కూడా పుస్తకాలను వదలరు. ఇలా బాగా చదివిన వారు కొంతమంది పరీక్షలు రాసి పాస్ అయితే మరికొంతమంది మాత్రం చదువుకుని అసలు పట్టించుకోకుండా పరీక్షల్లో చిత్రవిచిత్రమైన ఆన్సర్లు రాస్తూ ఉంటారు. మనం సినిమాలో చూసినట్లుగా కొంత మంది పరీక్షల్లో ఏకంగా సినిమా స్టోరీ లు రాయడం లాంటివి నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి.


 ఇక ఇలాంటివి జరిగినప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగింది. ఓ విద్యార్థి పరీక్షలో రాసిన ఆన్సర్ పేపర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక అక్కడ అడిగిన ప్రశ్నకు సదరు స్టూడెంట్ మైండ్లో తట్టిన ఆన్సర్ మాత్రం నభూతో నభవిష్యత్ అన్న విధంగా తుంది అని ప్రస్తుతం నెటిజన్లు కూడా అనుకుంటున్నారు. ఇంగ్లీష్ గ్రామర్ పరీక్షలో భాగంగా గుడ్, బ్లాక్, ఒరిజినల్ అనే పదాలకు ఆపోజిట్ పదాలు రాయాల్సి ఉంది.


 ఈ క్రమంలోనే సదరు విద్యార్థి ఈ మూడు పదాలకు జవాబుగా బాడ్, వైట్, చైనా అనే ఆన్సర్ ఇచ్చాడు. రాసిన రెండు ఆన్సర్ లు కూడా కరెక్ట్ మూడో ప్రశ్న కి దిమ్మతిరిగే ఆన్సర్ రాశాడు. మార్కెట్లో కనిపించే అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లకు డూప్లికేట్ తయారు చేయడంలో చైనా పెట్టింది పేరు. ఈ విషయం నేటి రోజుల్లో అందరికీ తెలుసు. అందుకే మనోడికి కూడా తెలుసన్నమాట. ఇంకేముంది ఒరిజినల్ కనిపించగానే చైనా అని రాశాడు. ఆ తర్వాత ఒక బ్రాకెట్లో ఆర్టిఫిషియల్ అనే సమాధానం రాసి మళ్లీ సరిచేస్తాడు. దీంతో అతడు రాసిన ఆన్సర్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: