సాధారణంగా వర్షం పడింది అంటే చాలు మీకు ప్రతి ప్రాంతంలో కప్పలు దర్శనమిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కప్పల కి అటు వర్షానికి అవినాభావ సంబంధం ఉంది అని చెబుతూ ఉంటారు. అందుకే ఒకవేళ వర్షాలు కురవక పోయినా కూడా కప్పలను ఒక కట్టెకు కట్టి ఊరంతా ఊరేగిస్తు పూజించడం లాంటి ఘటనలు కూడా అక్కడక్కడా తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు కప్పలు అరిస్తే కూడా వర్షం వస్తుందని ఎంతోమంది నమ్ముతుంటారు.  అది సరే గానీ ఇప్పుడు కప్పలు గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.


 సాధారణంగా ఇప్పుడు వరకు ప్రతి ఒక్కరు కూడా కప్పల చూసే ఉంటారు. కప్పలు ఆకుపచ్చ కలర్ లో లేదా గోధుమ  కలర్ లో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం వింతైన కప్పలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్థానికులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇంతకీ ఈ వింత కప్ప లు ఏ కలర్ లో ఉన్నాయో తెలుసా ఏకంగా పసుపు రంగు కలర్ లో. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం మండలం లో వెలుగులోకివచ్చింది. బండారులంక గ్రామంలో మట్టపర్తి వారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పులు కనిపించాయి. మూడు రోజుల నుంచి ఆ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఇక వర్షపునీటిలో పసుపు రంగు కప్పలు  వచ్చి చేరాయి.


 ఈ వింతైన కప్పను చూసి స్థానికులు అందరూ కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు అనే చెప్పాలి. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి కప్పలను కూడా లేదని స్థానికులు అంటున్నారు. అయితే కోనసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే సమయంలో  తుఫాను సంభవించే ముందు ప్రకృతి ఇలా హెచ్చరిస్తోంది అక్కడి ప్రజలు గట్టి నమ్మకం. గతంలోనూ తూనీగల గుంపు ఆకాశంలో తిరిగితే తుఫానులు వస్తుందని అక్కడ ప్రజలు నమ్మారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా వింతైన కప్పలు కనిపిస్తుండడంతో ఎలాంటి ప్రకృతి సంక్షోభం సంభవిస్తుందో అని అక్కడి ప్రజలందరూ కూడా భయాందోళనలో మునిగిపోతున్నారు. అయితే ఇవి సాధారణ కప్పలేనని వీటిని బుల్ ఫ్రాగ్స్ అంటారని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: