కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. కొంతమంది వ్యక్తులు  సరి కొత్తగా ఉపాధి కల్పించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దేనికి పనికి రావు అన్న వస్తువులను కూడా అందరికీ పనికొచ్చే విధంగా మారుస్తూ ఎంతోమంది ఉపయోగపడుతుంటారు. ఆదాయాన్ని కూడా అంతకంతకూ పెంచుకుంటున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకునేది కూడా ఇలాంటి తరహా వ్యక్తి గురించి అని చెప్పాలి. సాధారణంగా పాతబడిన జీన్స్ ని ఎవరైనా ఏం చేస్తారు డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంటారు.


 మరికొంత మంది వాటిని కత్తిరించుకుని ఇంట్లో తుడిచే బట్ట లాగా వాడుకుంటూ ఉంటారు. లేదా అదే జీన్స్ ను కత్తిరించుకుని షాట్ లాగ ఉపయోగిస్తారు. అదే మొత్తం చిరిగిపోతే  ఇంకేం చేస్తాం.. మొత్తం చెత్త కుప్పలో పడేయడమే అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చినిగిపోయిన జీన్స్ తో ఎంతో ఉపయోగపడే పని చేస్తున్నాడు ఒక వ్యక్తి. చినిగి పోయి దేనికి పనికి రావు అన్న జీన్స్ ప్యాంట్ తో ఏకంగా లాప్టాప్ పెట్టుకునే బ్యాగులను తయారు చేస్తూ ఉన్నాడు. అతను చేసిన చిన్న ఆలోచన ఎంతోమందికి ఉపయోగకరం గా మారిపోయింది.. అంతే కాదు అతనికి వినూత్న రీతిలో ఆదాయ వనరుగా కూడా మారింది అని చెప్పాలి.



 యూపీలోని గజియాబాద్ కు చెందిన పప్రేమ్ అనే వ్యక్తి ఇలా వినూత్నమైన ఆలోచన చేశాడు. రోడ్డు పక్కన టైలరింగ్ చేస్తూ ఉంటాడు ప్రేమ్. ఈ క్రమంలోనే పనికిరాని వస్త్రాలు చీరలు జీన్స్ ప్యాంట్ లతో వినూత్నంగా బ్యాగులు కుట్టి ఇక అమ్మడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక ఇటీవలే ఒక వ్యక్తి తన చిరిగిపోయిన జీన్స్ టైలర్ దగ్గరికి తీసుకువెళ్లగా దానిని లాప్టాప్ కోసం ఉపయోగించే బాగుగా ఎంతో అందంగా కుట్టేశాడు. ఇది చూసి అవాక్కయిన వ్యక్తి ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పెట్టడంతో అతని టాలెంట్ ప్రపంచానికి తెలిసిపోయింది.  దీంతో అతని టాలెంట్ కి అందరూ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: