ఏపీలో ఇటీవల పలు జిల్లాల్లో పులి గ్రామాల్లోకి రావడం, పాడిపశువులపై దాడి చేయడం చూస్తూనే ఉన్నాం. పులి భయంతో కొన్ని గ్రామాలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. పులులకోసం అటవీ శాఖ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మరీ వాటిని పట్టుకునేందుకు శ్రమ పడుతున్నారు. అయితే పులి మాత్రం అడవిలోకి వెళ్లిపోతూ, తిరిగి జనావాసాలకు దగ్గరగా వస్తూ దోబూచులాడుతోంది.

పులులు సహజంగా 3 లేదా 4 ఏళ్ల వయసులో అడవిని వదిలిపెట్టి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాయని, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో సంచరిస్తున్న పులి కూడా అలాగే వచ్చి ఉంటుందని తెలిపారు జిల్లా అటవీశాఖ అధికారులు. పులి పాద ముద్రలను గమనిస్తే దాని వయసు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాలుగేళ్ల వయసున్న పులి.. అడవినుంచి సుదూర ప్రాంతాలకు రావడం సహజం అంటున్నారు. పాపికొండల సమీపంలోని పార్క్‌ లో నాలుగైదు పులులు ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. అయితే జిల్లాకు వచ్చిన పులి అక్కడినుంచే వచ్చిందా, లేక వేరే ప్రాంతం నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది. పులి రోజుకు 30 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని అంచనా. పులి ప్రయాణం ఎక్కువగా రాత్రుళ్లు ఉంటుంది. రాత్రి పూట.. ఎక్కువగా బయట సంచరిస్తుంది. పగటిపూట సురక్షితంగా ఉన్న ప్రాంతంలో అలాగే ఉండిపోయుంది. అయితే ఇప్పుడు ఉన్న పులి ఎటునుంచి వచ్చిందో చెప్పగలం గానీ, ఎటు వెళ్తుందో కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.

ఎరవేసి పులిని పట్టుకోవడానికి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయత్నించామని, కానీ అది అక్కడి బోనులోకి రాకుండా ఎరను చూసి వెళ్లిపోయిందన్నారు. పులి చాలా తెలివైన జంతువని, అది అంత దొందరగా ఎరకు చిక్కదని, అదే సమయంలో దాడి చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. పులి క్రూర జంతువు కావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరో రెండురోజుల్లో పులి విశాఖ రేంజిలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ఆయా గ్రామాల సర్పంచ్ లకు సమాచారం ఇచ్చామని, విశాఖ జూ నుంచి వెటర్నరీ డాక్టర్‌ ను కూడా రప్పించి పులిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అ్నారు. అయితే విజయనగరం జిల్లాలో తిరుగుతున్న పులి, ఇక్కడ అనకాపల్లి జిల్లాలో ఉన్న పులి ఒకటి కాదంటున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: