ఇక భారత హోంశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (intelligence Bureau) మొత్తం 766 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఐబీ (IB) ఓ రిక్రూట్‌మెంట్ (Recruitment) నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. సెక్యూరిటీ అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వంటి పోస్టులతో సహా గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల కోసం ఐబీ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. ఇక ఈ 2022 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను డిప్యూటేషన్ ప్రాతిపదికన (Deputation Basis) ఇంటెలిజెన్స్ బ్యూరో నియమించుకుంటుంది. ఇంకా అలాగే అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను ఆఫ్‌లైన్ మోడ్‌లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరిన్ని వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ mha.gov.in ను విజిట్ చేయవచ్చు. ఇక నోటిఫికేషన్ విడుదలైన 60 రోజులలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఇంకా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.


ఇక అదేంటంటే, ఐబీ రిక్రూట్‌మెంట్ 2022 కోసం సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా స్టేట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కింద పని చేస్తున్న అధికారులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే డిప్యూటేషన్ వ్యవధి పూర్తయిన తర్వాత మళ్లీ వారు తమ పేరెంట్ డిపార్ట్‌మెంట్ లో చేరవచ్చు. ఇంకా 766 ఖాళీలలో ఏయే భాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఆ పోస్టులకు కావలసిన అర్హత ఏంటి? జీతం వంటి వివరాలన్నీ  కూడా మీరు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.ఇక IB రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ అనేది మీకు కేవలం ఆఫ్‌లైన్ మోడ్‌లోనే జరుగుతుంది.ఆన్లైన్లో లో జరగదు.ఇక అభ్యర్థి గత డిప్యూటేషన్ నుంచి 3 సంవత్సరాల కూలింగ్-ఆఫ్ వ్యవధిని పూర్తి చేసి ఉండాలి. కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత గల అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇంకా పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: