జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లోమీడియా 24 గంటలూ 365 రోజులు నెగిటివ్ గా కథనాలు అచ్చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో చంద్రబాబునాయుడు తప్పులను జనాలకు అసలు కనబడకుండా చేయాలన్నది ఎల్లోమీడియా తాపత్రయం. తాను కూస్తేకానీ జనాలకు తెల్లారదన్న పద్దతిలో  వ్యవహరిస్తుంటుంది ఈ మీడియా. ఇలాంటి ఎల్లో మీడియా కూడా బహిరంగంగానే  చంద్ర్రబాబును తప్పుపడుతు  కథనం అచ్చేసిందంటే సందేహించాల్సిందే.





తెరవెనుక ఏదో జరిగిందని అర్ధమవుతోంది. లేకపోతే ఒక విషయంలో జగన్ తప్పుపట్టిన ఎల్లోమీడియా అదే విషయంలో చంద్రబాబును కూడా తప్పుపట్టడమే ఆశ్చర్యంగా ఉంది. పైగా జగన్, చంద్రబాబు ఇద్దరూ బీజేపీ ప్రపకంకోసమే పాకులాడుతున్నట్లు కథనం అచ్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు వైసీపీ, టీడీపీలు పోటీపడి మరీ సంపూర్ణమద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.





రెండుపార్టీలు కూడా ముర్ముకు మద్దతు ప్రకటిస్తు సామాజికన్యాయంలో భాగంగా గిరిజనురాలు కాబట్టే ముర్ముకు మద్దతిచ్చినట్లు చెప్పుకుంటున్నాయి. ఇదే విషయాన్ని ఎల్లోమీడియా ప్రస్తావిస్తు గతంలో పీఏ సంగ్మా రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేసినపుడు రెండుపార్టీలు ఎందుకని మద్దతివ్వలేదని ఎల్లోమీడియా నిలదీసింది. సంగ్మాకు ప్రత్యర్ధిగా పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీకి వైసీపీ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.






పనిలో పనిగా చంద్రబాబు అప్పటి ఎన్నికను బహిష్కరించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. సంగ్మా కూడా గిరిజునుడే అయినపుడు అప్పడెందుకు జగన్, చంద్రబాబు మద్దతివ్వలేదని ప్రశ్నించింది. కేసుల భయంతోనే ఇపుడు జగన్ ఎన్డీయే అభ్యర్ధికి మద్దతిస్తున్నట్లు తేల్చేసింది. ఇదే సమయంలో మళ్ళీ మోడీతో సయోధ్యకోసమే చంద్రబాబు మద్దతు ఇచ్చినట్లు ఎల్లోమీడియా తేల్చేసింది. కమలనాదులు కోరకుండానే రెండుపార్టీలు మద్దతిచ్చినట్లు చెప్పటం మాత్రం తప్పే.  ద్రౌపదిని అభ్యర్ధిగా ప్రకటించేముందదే జగన్ తో మోడీ సంప్రదించినట్లు స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గజేంద్ర షెకావత్ ఇప్పటికే చెప్పారు. చంద్రబాబు మాత్రం ఎవరు అడగకుండానే మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని చంద్రబాబు పక్కనుండగా స్వయంగా ద్రౌపదే చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: