సాదారణంగా పిల్లలు టీవీ,సినిమాలు చూస్తె చదవడం తగ్గిస్తారని, తల్లి దండ్రులు వాళ్ళకు దూరంగా టీవీల ను ఉంచడం మనం చూసే ఉంటాము.. అయితే ఈ విషయం పై కొన్ని చర్చలు జరిగిన విషయం తెలిసిందే.  విద్య తో పాటు, వినోదం కూడా ఉండాలని కొందరు నిపుణులు తేల్చి చెప్పారు. అయితే ఈ విషయం పై కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయాల ను తీసుకున్నారు. పిల్లలు సినిమాలు తప్పనిసరి అని చెప్పారు. అందులో తమిళనాడు ప్రభుత్వం కూడా ఒకటి.. వివరాల్లొకి వెళితే..


సినిమాలు అనేవి చిన్నపిల్లలు చూడకూడదు.. అందులో అభ్యంతరకర దృశ్యాలు ఉంటాయి.. అవి పిల్లలకు మంచిది కాదు.. ఇవన్నీ మనం తరచుగా వినే మాటలే కానీ సినిమాల వల్ల పిల్లలకు మంచి కూడా జరగవచ్చు అని కొందరు అభిప్రాయపడతారు. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా అదే అభిప్రాయపడింది. అందుకే స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకం గా సినిమా స్క్రీనింగ్‌ ను ఏర్పాటు చేసింది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ప్రకారం రాష్ట్రంలోని 13,000 స్కూళ్లలో నెలకొక సారి ఒక సినిమా ప్రదర్శించబడుతుంది. అది ఏ సినిమా అని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.


జులైలోని ఈ కార్యక్రమాని కి శ్రీకారం జరిగింది. మొదటి నెలలో చార్లీ చాప్లిన్ హీరోగా నటించిన సైలెంట్ సినిమా 'ది కిడ్'ను చూసి ఆనందించారు విద్యార్థులు. సినిమాలు అనేవి విద్యార్థు ల్లో ఆలోచించే శక్తిని పెంచుతాయని తమిళనాడు విద్యాశాఖ అంటోంది. వారికి చూపించడం కోసం మంచి సినిమాలను ఎంపిక చేస్తామంటూ హామీ ఇస్తోంది. కానీ ఇప్పటివరకు కేవలం ఈ కార్యక్రమం 6 నుండి 9వ తరగతులు చదువుతున్న విద్యార్థుల వరకే పరిమితమయ్యింది. దీంతో పాటు స్కూలు విద్యార్థుల కోసం మరెన్నో కొత్త కార్యక్రమాల కు నాంది పలికారు.. అన్నీ విదాలుగా పిల్లలు వుండాలని అధికారులు చెబుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: