పేరుకు చెప్పుకోవటానికి మాత్రమే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. సమాజానికి ఉపయోగపడే సలహా కానీ సూచనకానీ ఒక్కటంటే ఒక్కటికూడా ఉండదు  చంద్రబాబునాయుడు నుండి. తాజాగా చంద్రబాబు చేస్తున్న బురద రాజకీయమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వంలో ఎవరున్న వరదలు, తుపానులు వచ్చినపడు, తర్వాత లంక గ్రామాలు లేదా ముంపు గ్రామాల జనాలు ఇబ్బందులు పడటం సహజమే. అలాగని జనాలు ఎప్పుడు ఇబ్బందులు పడుతుండాలని కాదు.





చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు అసలు లంక గ్రామాల అభివృద్ధిని, పోలవరం ప్రాజెక్టు పునరావాస వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది తాజా వరదల కారణంగా ఏటపాక మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు పడుతుంటే వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింతగా రెచ్చగొడుతున్నారు. తమ గ్రామాలను మళ్ళీ తెలంగాణాలో కలిపేయాలని కొందరు గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు చంద్రబాబు మద్దతు ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఐదేళ్ళు వీళ్ళ సమస్యలు పట్టించుకోని చంద్రబాబు ఇపుడు అవే సమస్యలపై ఆందోళన చేస్తుండటమే రాజకీయం. 





గ్రామస్తుల డిమాండ్ ప్రకారం ఐదు గ్రామాలను తెలంగాణాలో కలపటం సాద్యంకాదని అందరికీ తెలుసు. చివరకు ఆందోళనచేస్తున్న జనాలకు కూడా బాగా తెలుసు. అయినా వాళ్ళు డిమాండ్లు చేయటం వాళ్ళకి చంద్రబాబు మద్దతు తెలపటం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. సౌకర్యాలు లేక, వరద కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారంటే చంద్రబాబు హయాంలో కూడా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందలేదనే కదా అర్ధం. గ్రామస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేయటంలో తప్పులేదు.






అంతేకానీ జగన్మోహన్ రెడ్డిపైకి జనాలను రెచ్చగొడితే అందరు తనకు మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకనే వరదబాధితుల పరామర్శపేరుతో బురద రాజకీయాలకు తెరలేపారు. మొత్తానికి తనకున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సమాజానికి ఉపయోగపడదని అర్ధమైపోతోంది. ఎంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటారా ? వాళ్ళని ఎలా రెచ్చగొట్టి పబ్బంగడుపుకుందామా అనిమాత్రమే 24 గంటలూ చూస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో చంద్రబాబుకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్పలేం కానీ ఇపుడు కంపు చేస్తున్నది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: