వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలుస్తుందా లేదా అనే అంశంపై  పెద్ద డిబేట్ నడుస్తోంది. ఈ సమయంలోనే చంద్రబాబునాయుడు వయసుపైన కూడా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి కొడాలినాని లాంటి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతు చంద్రబాబు వయసైపోయింది కాబట్టి ఇక రాజకీయాలక పనికిరాడని చెబుతున్నదే. దానికితగ్గట్లే తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబుకు అర్ధం కావటంలేదు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబు వయసునే వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.





సరిగ్గా ఇలాంటి విషయంపైనే టీడీపీలో కూడా చర్చ జరుగుతోందట. ఈమధ్యనే జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు స్వయంగా ఇదే విషయాన్ని ప్రస్తావించారట. తన వయసుపైన జరుగుతున్న చర్చను తమ్ముళ్ళంతా ఖండించాలని చెప్పారట. తన వయసు గురించి టీడీపీ నేతలు ఎక్కడా ప్రస్తావించద్దని చంద్రబాబు ఆదేశించారట. అంటే రాబోయే ఎన్నికల్లో తన వయసు పార్టీ గెలుపుకు పెద్ద అడ్డంకిగా మారుతుందనే భయం చంద్రబాబులో కనబడుతోంది.






వచ్చే ఎన్నికలకు చంద్రబాబు వయసు 75 ఏళ్ళు  దాటుతుంది. నిజానికి 75 ఏళ్ళంటే పెద్ద వయసనే అనుకోవాలి. మామూలుగా విశ్రాంతజీవితం గడిపేవారికి ఓకేనే కానీ రాజకీయాల్లో ఉన్నవారికి ముఖ్యంగా చంద్రబాబు లాంటివారికి కష్టమే. ఎందుకంటే చంద్రబాబు మాటమీద అదుపు తప్పిపోతోంది. చెప్పిందే చెప్పటం లేదా గతంలో తాను మాట్లాడినదానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడటం ఎక్కువైపోతోంది.






తనకు వయసు అయిపోతోందనే ఇబ్బంది చంద్రబాబులో కూడా  పెరిగిపోతోందనే అనిపిస్తోంది. అందుకనే ఈమధ్య వైజాగ్ పర్యటనకు వెళ్ళినపుడు ‘తమ్ముళ్ళూ నాకు వయసైపోతోందా ? నేను ఫిజికల్గా, మెంటల్ గా ఫిట్ గా లేనా’ అంటు పదే పదే అడిగారు. అంటే తన మెంటల్, ఫిజికల్ ఫిట్నెస్ గురించి జనాలనే అడిగారంటే అర్ధమేంటి చంద్రబాబులో కూడా అభద్రత మొదలైందనే కదా ? దానికితోడు వైసీపీ వాళ్ళు మొదలుపెట్టిన మైండ్ గేమ్ వర్కవుటవుతోందనే అర్ధమవుతోంది. లేకపోతే తన వయసుగురించి బయటెక్కడా మాట్లాడద్దని చంద్రబాబు తమ్ముళ్ళకు ఆదేశాలివ్వటం ఏమిటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: