ఉచితహామీలు ఇపుడ పెద్ద సమస్యగా మారిపోయింది. నరేంద్రమోడీ ఉచితాలపై పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాంతో సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉచితాలను అరకిట్టేందుకు ఒక కమిటిని నియమించారు. సరే సుప్రింకోర్టు ఇలాంటి కమిటీలు ఎన్ని వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఉచితాలపై నిర్ణయాలు తీసుకోవాల్సిన రాజకీయపార్టీలు వ్యతిరేకంగా ఉన్నంతవరకు ఎవరు ఏమీ చేయలేరు.





సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఉచితాలపై మోడి వ్యతిరేకంగా ఉన్నది నిజమే అయితే వెంటనే తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. ఎలా నిరూపించుకోవాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముందు ఉచిత హామీలన్నింటినీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుండి ఉచితహామీలన్న మాటే వినపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పరిమితికి మించిన సంక్షేమపథకాలను కూడా కోతపెట్టేయాలి. వచ్చే ఎన్నికల్లో అమలుచేయబోయే సంక్షేమపథకాల విషయంలో జనాలకు క్లారిటి ఇవ్వాలి.






దేశంలోని అన్నీ రాష్ట్రాలకు బుద్ధులు చెప్పేముందు ఉచితహామీలపై తన ఆలోచనను ముందు తనింటినుండే మొదలుపెట్టాలి. ఎదుటివాడికి బుద్ధిచెప్పేముందు అదేదో తానే ఆచరించి చూపితే తర్వాత ఎవరు తప్పుపట్టే అవకాశముండదు. కాబట్టి నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఉచితాలను నిలిపేయమని చెప్పేముందు తమ ప్రభుత్వాల నుండే ఆపని మొదలుపెట్టాలి. ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉచితహామీలను ఇచ్చేది లేదన్న మాటకు కట్టుబడుంటాయో అప్పుడు ఇతర పార్టీల గురించి మాట్లాడే నైతికత బీజేపీకి వస్తుంది.






అలాకాకుండా ఉచితాలకు వ్యతిరేకమని, ఉచితహామీల అమలు వల్ల దేశాభివృద్ధి ఆగిపోతోందని గోలచేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని మోడీ గ్రహించాలి. ఉచిత హామీలివ్వకూడదు, సంక్షేమపథకాల్లో వీలైనంత కతలు విధించాలి, సబ్సిడీలను ఎంత వీలైతే అంతా ఎత్తేయాలనే విషయాలు ముందు మోడీనే ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు వేరేదారిలేక మిగిలిన ప్రభుత్వాలు కూడా ఆచరణలోకి తీసుకొస్తాయి. మరి పైన చెప్పిన మూడు చేయటానికి నరేంద్రమోడీకి ధైర్యముందా ? ఉంటే వచ్చే ఎన్నికల్లోగానే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెంటనే ఆచరణలోకి తీసుకొచ్చేయాలి. చూద్దాం తర్వాత ఏమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: