క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. రెండురోజుల్లో ఢిల్లీలో జరిగిన రెండు పరిణామాలు చూసిన తర్వాత అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 6వ తేదీ ఆజాదీ కి అమృతోత్సవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న చంద్రబాబునాయుడుతో  నరేంద్రమోడి కొద్దిసేపు మాట్లాడారు. దీన్ని టీడీపీ, ఎల్లోమీడియా బాగా హైలైట్ చేయటంతో రచ్చ మొదలైంది.

ఆ మరుసటిరోజే జరిగిన నీతిఅయోగ్ సమావేశంలో నరేంద్రమోడి, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్ తో పాటు మరో నలుగురితో కలిసి నరేంద్రమోడీ భోజనం దగ్గర దాదాపు గంటకుపైగా మాట్లాడారు. దాంతో వైసీపీ నుండి టీడీపీ, ఎల్లోమీడియాకు కౌంటర్లు మొదలయ్యాయి. ఐదునిముషాలు మాట్లాడినందుకే ఎల్లోమీడియా ఇంతగోల చేస్తే మరి గంటపాటు భోజనం సమయంలో మోడి-జగన్ భేటీ అవ్వటాన్ని ఏమనాలంటు ప్రశ్నించారు.

ఇదంతా చూసిన తర్వాత ఒక అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే ముందురోజు చంద్రబాబుతోను మరుసటి రోజు జగన్ తో ను మోడీ ఉద్దేశ్యపూర్వకంగానే కలిశారా అని. ఎందుకంటే రాజకీయాల్లో వీళ్ళద్దరికన్నా మోడీ మహా ముదురు. పైగా దేశాధిపతి హోదాలో ఉన్నారు కాబట్టి ఇటు చంద్రబాబు అయినా అటు జగన్ అయినా మోడీ చెప్పిందానికి తలూపటం తప్ప చేయగలిగేదేమీలేదు. చంద్రబాబుతో మాట్లాడితే వైసీపీకి మండుతుందని మోడీకి అంతమాత్రం తెలీదా ? అలాగే జగన్ తో భేటీఅయితే టీడీపీకి వైసీపీ కౌంటర్లు వేస్తుందని మోడీ అంచనా వేయలేరా ?


అందుకనే వ్యూహాత్మకంగా ఇద్దరితోను మోడీ మాట్లాడినట్లున్నారు. పనిలోపనిగా మిత్రపక్షమో లేకపోతే ప్రత్యర్ధో కూడా అర్ధంకాని స్ధితిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బీజేపీ డార్కులో పెట్టేసింది. జనసేన తమకు మిత్రపక్షమే అని చెబుతునే ఏ కార్యక్రమానికి పవన్ను ఆహ్వానించటంలేదు. అపాయిట్మెంట్ అడిగినా మోడీ, అమిత్ షా ఇవ్వటంలేదు. అంటే పవన్ను నెత్తినా పెట్టుకోవటంలేదు అలాగని దూరంగా వెళ్ళిపోవటానికి అవకాశమూ ఇవ్వటంలేదు. సో జరుగుతున్నది చూస్తుంటే ముగ్గురితోను బీజేపీ ఆటాడుకుంటున్నట్లే అనిపిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: