హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో విషయంలో పోలీసులు ఒక విషయంలో క్లారిటి ఇచ్చారు. ఇపుడు సర్క్యులేషన్లో ఉన్న వీడియో ఒరిజినల్ కాదని మాత్రం చెప్పేశారు. అనంతపురం ఎస్సీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతు సర్క్యులేషన్లో ఉన్న వీడియో ఎడిటింగ్ చేసింది లేదా మార్ఫింగ్ చేసిన వీడియో అయ్యుండచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు. ఇదే సమయంలో ఈ వీడియోను ఐటీడీపీ వెబ్ సైట్లో అప్ లోడయ్యిందన్నారు. ఆ తర్వాత ఎడిటింగ్ జరిగి చాలాచోట్లకు ఫార్వార్డ్ జరిగిందన్నారు.


ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగలమన్నారు. ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి లండన్లో రిజిస్టర్ అయిన +447443703968 నెంబర్ నుండి వీడియో అప్ లోడయినట్లు ఎస్పీ చెప్పారు. ఇఫుడా నెంబర్ ఎవరిదో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఆ నెంబర్ వివరాలు తెలిస్తే మొత్తం కుట్రంతా బయటపడుతుంది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో మాధవ్ ను పోటీచేయించే విషయంలో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.


కురబ సామాజికవర్గంలో బాగా పట్టున్న మాధవ్ ను వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేయించాలని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం. అయితే హిందుపురం నుండే పోటీచేయిస్తారా ? లేకపోతే ఆయన సొంతజిల్లా అయిన కర్నూలులోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీచేయిస్తారా అన్నది తేలలేదు.


మొదట్లో మాధవ్ పై యాక్షన్ తీసుకోవాలనే అనుకున్నారు. అయితే వీడియో వెనక ప్రత్యర్ధుల కుట్ర ఉండచ్చనే అనుమానాలు మొదలవ్వటంతో యాక్షన్ తీసుకునే విషయం పక్కకుపోయింది. ఇంతలో వీడియోవిషయం పక్కకుపోయి కురబ వర్సెస్ కమ్మ సామాజికవర్గాల గొడవగా మారిపోయింది. కురబ సామాజికవర్గంలో మెజారిటి మాధవ్ కు మద్దతుగా నిలబడ్డారు. ఒకవైపు సామాజికవర్గాల గొడవ జరుగుతుండగానే మాధవ్ పై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎంపికి బదులుగా ఎంఎల్ఏగా పోటీచేయిస్తే సరిపోతుందని కూడా అనుకున్నట్లు సమాచారం. చూడాలి చివరకు ఏమవుతుందో.మరింత సమాచారం తెలుసుకోండి: