భారతీయ అతి పెద్ద భీమా సంస్థ ఎల్ఐసీ గురించి అందరికి తెలిసిందే..లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ.చిన్న నుంచి పెద్ద వయస్సు అందరూ కూడా ఎల్ఐసీ లో బెనిఫిట్స్ పొందుతున్నారు..కొన్ని స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి ఉంటుంది. అలాంటి వాటిలో ఒకటి వరిష్ఠ పెన్షన్ బీమా యోజన..వరిష్ఠ పెన్షన్ బీమా యోజన -2014 పథకాలు విజయవంతం కావడంతో, అదే బాటలో మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.. వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా 'ప్రధానమంత్రి వయ వందన యోజన అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది.


 60 ఏళ్లు దాటిన వాళ్ల కోసం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకొచ్చిన పెన్షన్‌ స్కీమ్‌ ఇది..తాజాగా 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ పాలసీని ఆన్‌లైన్‌ ద్వారా, అంటే ఎల్‌ఐసీ ఏజెంటును సంప్రదించి తీసుకోవచ్చు లేదా ఆన్‌లైన్‌ ద్వారాను కొనుగోలు చేయొచ్చు. పాలసీని కొనుగోలు చేయడానికి గరిష్ట మొత్తం రూ.15 లక్షలు. అంటే, ఈ పరిమితి దాటకూడదు. పాలసీని కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచి ప్రతి నెలా పింఛను అందుతుంది..

ఈ స్కీమ్ లో చేరడానికి అర్హతలు, ప్రయోజనాలు..

ఇందుకు కనీస వయసు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువయి ఉండాలి. గరిష్ఠ వయో పరిమితి లేదు. పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు. ప్రతి నెలా కనీసం రూ.1,000 పింఛను వస్తుంది. గరిష్టంగా నెలకు రూ.9,250 అందుకోవచ్చు. నెలనెలా డబ్బు వద్దనుకుంటే, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం.. ఇలా మీకు నచ్చిన కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ కాల వ్యవధికి అనుగుణంగానే పింఛను మొత్తం చేతికి వస్తుంది. ఉదాహరణకు.. పాలసీదారు ఆరు నెలలకు ఒకసారి పింఛను కావాలనుకుంటే.. కనిష్టంగా రూ.6,000, గరిష్టంగా 55,500 పొందవచ్చు. ఆరు నెలలంటే కష్టం, మూడు నెలలకు ఒకసారి పింఛను తీసుకోవాలని మీరు నిర్ణయించుకుంటే, కనిష్టంగా రూ.3,000, గరిష్ఠంగా రూ.27,750 పొందవచ్చు.

ప్రయోజనాలు..

10 ఏళ్ల పాలసీ కాల వ్యవధిలో ఏటా దాదాపు 7.4 శాతం వడ్డీని చెల్లిస్తారు. పాలసీ గడువు వ్యవధి ముగిసిన తర్వాత, పాలసీదారుడికి పాలసీ కొనుగోలు మొత్తాన్ని, పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. ఒకవేళ పాలసీ ముగిసేలోపే మరణిస్తే, పాలసీ కొనుగోలు ధరను సంపూర్ణంగా నామినీకి చెల్లించేస్తారు. అప్పటివరకు తీసుకున్న పింఛను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు..

పాలసీ కొనుగోలు మొత్తంలో 75 శాతం వరకు రుణం రూపంలో తీసుకోవచ్చు. ఇచ్చిన అప్పు మీద వడ్డీని, ఇవ్వాల్సిన పింఛను మొత్తం నుంచి ఎల్‌ఐసీ మినహాయించుకుంటుంది..పాలసీని రద్దు చేసుకోనే వెసులుబాటు కూడా ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: