పండగ సీజన్ వస్తే ఈ కామర్స్ కంపెనీలు చాలా బిజిగా ఉంటాయి. ఆ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఫెస్టివ్ సీజన్‌లో సెలవులు కూడా లభించకపోవచ్చు.అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించే ఒక కంపెనీ ఉద్యోగులకు తీపికబురు అందించింది. బిజీ సీజన్ అయిపోయిన తర్వాత ఉద్యోగులు రిఫ్రెష్ అవ్వడానికి మీషో ప్రత్యేకమైన సెలవులను తీసుకువచ్చింది. ఉద్యోగులకు 11 డే బ్రేక్ తీసుకువచ్చింది. రీసెట్ అండ్ రీచార్జ్ కోసం ఈ లీవ్స్‌ను తెచ్చింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకు ఈ లీవ్స్ పొందొచ్చు...


కంపెనీ ఇలా సెలవులు ప్రకటించడం ఇది రెండోసారి కావడం విశేషం..ఈకామర్స్ పరిశ్రమలో ఇలాంటి సెలవులు అందిస్తున్న తొలి సంస్థగా మీషో నిలిచింది. పనికి పూర్తిగా దూరంగా ఉండటానికి, ఫెస్టివ్ సీజన్ బిజీ తర్వాత ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సెలవులు తీసుకువచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది.ఇతర కంపెనీలు కూడా వారి ఉద్యోగుల విషయంలో ఇలాంటి విధానాలను అవలంభించాలని సూచించింది. మీషో చీఫ్ హ్యుమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. రెస్ట్ అండ్ రీచార్జ్ పాలసీ ద్వారా సాంప్రదాయ కార్యాలయ నిబంధనలను పునర్ నిర్వచిస్తున్నామన్నారు.


ఉద్యోగులు వారికి ఇష్టమైన రీతిలో ప్రశాంతంగా ఉండొచ్చని తెలిపారు. ప్రియమైన వారితో సమయం గడపడం, ప్రయాణం చేయడం లేదా కొత్త అభిరుచిని ఎంచుకోవడం చెయొచ్చునని అన్నారు..జూన్ నెలలో మీషో అన్‌లిమిటెడ్ లీవ్ పాలసీ తీసుకువచ్చింది. దీని ద్వారా ఉద్యోగులు 365 వరకు పెయిడ్ లీవ్స్ పొందొచ్చు. అయితే ఇది అందరికీ వర్తించదు. ఉద్యోగులకు లేదా వారి కుటుంబ సభ్యులకు క్రిటికల్ ఇల్‌నెస్ సంభవిస్తే, హస్పిటల్‌కు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తే.. అలాంటప్పుడు ఉద్యోగులకు ఈ లీవ్స్ లభిస్తాయి. సెల్ఫ్ ఇల్‌నెస్ అయితే ఫుల్ శాలరీ వస్తుంది. అదే కుటుంబ సభ్యులకు ఇల్‌నెస్ వచ్చి లీవ్‌లో ఉంటే 25 శాతం వేతనం చెల్లిస్తారు. మీషో కంపెనీ ఉద్యోగుల కోసం వినూత్నమైన పాలసీలు అందుబాటులో ఉంచిందని చెప్పుకోవచ్చు.మొత్తానికి ఈ కంపెనీ ఉద్యోగులకు వరాన్ని అందించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: