సాధారణం గా విమానం నడిపే పైలెట్లు ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తం గా ఉండాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పటికప్పుడు సిగ్నల్స్ ఆధారం గా ఇక విమానం దిశను మార్చుతూ ముందుకు దూసుకు పోవాల్సి ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగిన కూడా చివరికి విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమం లోనే ఇలా పైలెట్లు చేసిన పొరపాట్లు ఏకం గా విమానం లో ఉన్న ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలను కూడా ప్రమాదం లో పెట్టేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలం లో ఎంతో మంది పైలెట్లు విమానం నడుపుతూనే నిద్ర లోకి జారుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయ్. ఒక ఘటన గురించి మరవక ముందే ఇలాంటిదే మరో ఘటన కూడా వెలుగు లోకి వస్తు సంచలనం గా మారి పోతుంది అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఇలా విమానం నడిపే సమయంలో పైలెట్లు నిద్రపోతారు అన్న విషయం వెలుగులోకి రావడంతో ప్రయాణికులు కూడా కాస్త భయాందోళనకు గురవుతున్నారు. అయితే అందరూ పైలెట్లు కూడా ఇలా విమానం నడిపే సమయంలో నిద్రపోతారా అన్న విషయం పై ఒక సర్వే నిర్వహించగా సంచలన విషయం  ఈ సర్వేలో వెళ్లడయ్యింది. ఒక సర్వే ప్రకారం భారతదేశ పైలెట్లు తమ షిఫ్ట్ సమయాలలో విమాన కాక్ పీట్ లో నిద్రపోయారని తేలింది. దీనికి కారణం సరైన నిద్ర లేకపోవడమే అన్న విషయం సర్వేలో వెళ్లడయింది. 542 మంది పైలెట్ల పై చేసిన సర్వేలో.. 66% మంది పైలెట్లు వారు నిద్రించే సమయాలు మారుతున్న నేపద్యంలో విమానం నడుపుతున్న సమయంలో వారికి తెలియకుండానే కొంత సమయం నిద్రపోతూ ఉంటారట. ఇలా జరగడానికి ఎక్కువ సేపు మేల్కొని ఉండటం.. అలసట తీవ్రమైన ఒత్తిడి కారణం అన్న విషయం పైలెట్లు చెప్పినట్లు ఇక సర్వే సర్వేలో వెళ్లడయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: