ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాలను సంసిద్ధం చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఈసారి ఎక్కువ సీట్ లను గెలుచుకోవడం పైన దృష్టిని పెడితే, ప్రతిపక్షములో ఉన్న టీడీపీ మాత్రం ఎలాగైనా ఈసారి అధికారంలోకి వచ్చి తీరాలన్న కసితో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ నేతలకు మరియు ఇంచార్జి లకు మీటింగ్ ను కండక్ట్ చేశారు. అయితే ఈ మీటింగ్ లో మొత్తం 59 మంది ప్లాగొన్నారు... వారిని ఉద్దేశించి మాట్లాడిన బాబోరు సీరియస్ గా క్లాస్ పీకారట.

చంద్రబాబు ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో .. చాలా సూటిగా ప్రశ్నించారట. అస్సలు... ఎన్నికల కోసం రెడీ గా ఉన్నారా ? మీ మీ నియోజకవర్గాలలో కార్యకర్తలు మరియు ఓటర్లు మీ నియంత్రణలోనే ఉన్నారా ? అంటూ ప్రశ్నల దాడి చేశారట. ఒకవేళ మీరు కనుక సిద్ధంగా లేకపోతే మీకు బదులుగా ఇంచార్జి లను తీసుకుంటాం అంటూ అందరికీ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చేస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెల్సుకున్న చంద్రబాబు... చేయవల్సిన మార్పుల గురించి క్లియర్ గా దిశా నిర్దేశించా చేశారట.  

ఇక టీడీపీ కి అంతగా బలం లేని నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పారట. ఇక సరిగా పనితీరు కనబరచని ఇంచార్జి లను మరియు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఉండే వారిని తమ తీరును మార్చుకోవాలని ఆదేశించారట. ఇక కొందరు నేతలు ఏకపక్షముగా ప్రవర్తిస్తున్నారన్న విషయంపై కూడా చంద్రబాబు ఘాటుగా స్పదించారట. అందరినీ కలుపుకుని పోతే పార్టీలో ఉండండి, లేదంటే ఖచ్చితంగా తగిన చర్యలు తప్పవు అంటూ వార్నింగ్ ఇచ్చారట. ఇలా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు తతహలాడుతున్నారు. మరి ఈ రోజు జరిగిన మీటింగ్ వర్క్ అవుట్ అయ్యి టీడీపీ నేతల తీరులో మార్పు వస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: