తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నిక వలన పార్టీల మధ్య హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఇంతకు ముందు మునుగోడు లో ఎమ్మెల్యే గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివిధ కారణాలతో బీజేపీ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనితో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. కానీ ఇంకా ఉప ఎన్నికకు సంబంధించి అధికారిక షెడ్యూల్ రాలేదు. అయితే ఈ ఎన్నికలో గెలవడానికి ఒకవైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిలు పోటా పోటీగా వ్యూహాలతో తలమునకలై ఉన్నారు. ఇక తెరాస కూడా రేస్ లోనే ఉంది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారట.

తాజాగా మునుగోడు లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ మోటార్ లకు మీటర్లు పెట్టడం వలన నష్టం ఏమిటి అంటూ అడిగారట. ఇలా చేయడం వలన ఎవరు ఎంత విద్యుత్తును వాడుతున్నారు అన్నది తెలుస్తుంది అంటూ చెప్పారట రాజగోపాల్ రెడ్డి. అయితే ఇది రైతులకు ఆవేశాన్ని తెప్పించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే... అధికార ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు పెడితే రైతుల ప్రాణాలు తీసినట్లేనని పదే పదే చెబుతున్నారు, కాగా కాంగ్రెస్ పార్టీ సైతం మీటర్ లు పెట్టడం కరెక్ట్ కాదు అంటోంది.

అలాంటిది అది మరచి బీజేపీ నాయకుడు ఇలా ఎదురు రైతులనే ప్రశ్నించడం వలన మొదటికే మోసం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం మోటార్ లకు మీటర్లు పెట్టమని ఆదేశించినా.. స్థానికంగా ఉన్న సమస్యలను అర్ధం చేసుకుని వ్యవహరించాలి. మనము వారి ఓట్లు కావాలనుకుంటే వారికి నచ్చిన విదంగా మాట్లాడాలి తప్ప... అనవసర ప్రశ్నలు వేసి సెల్ఫ్ గోల్ వేసుకోకూడదని ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీని ప్రభావము ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: