వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబునాయుడు చాలా బలంగా అనుకుంటున్నారు. చంద్రబాబు అనుకుంటే అధికారంలోకి వచ్చేయగలరా ? అనుకుంటే రాలేరు కానీ వచ్చేఎన్నికల్లో గెలుపుమాత్రం తనదే అని చాలాబలంగా నమ్ముతున్నారు కూడా. ఒకవైపు పార్టీ బలోపేతమైన దాఖలాలు ఏమీలేవు. పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగిపోయినట్లు కూడా ఎక్కడా కనబడటంలేదు.

అయినా అధికారంలోకి వచ్చేయటం గ్యారెంటీ అని చంద్రబాబులో నమ్మకం ఎలాగవచ్చింది ? ఎలాగంటే కేవలం ఎల్లోమీడియానే కారణం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఎల్లోమీడియా పదేపదే కథనాలు, వార్తలు అచ్చేస్తున్నది. ఎన్నికలు ఎప్పుడుపెట్టినా చంద్రబాబును సీఎం చేయటానికి జనాలంతా కాచుక్కూర్చున్నారని ఎల్లోమీడియా ఒకటే ఊదరగొడుతోంది. దాంతో ఎల్లోమీడియాలో కనబడుతున్నదంతా నిజమే అనుకుని తాను అధికారంలోకి వచ్చేయటం ఖాయమని చంద్రబాబు అనుకుంటున్నారు.

ఇక్కడ ఒక పాయింట్ మాత్రం స్పష్టంగా కనబడుతోంది చంద్రబాబులో. అదేమిటంటే జగన్ మీద జనాల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి తాను అధికారంలోకి వచ్చేయటం ఖాయమని. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికారపార్టీపై జనాల్లో అసంతృప్తి ఉండటం చాలా సహజం. అయితే ఆ అసంతృప్తి ఏ స్ధాయిలో ఉందనేదే కీలకం. అసంతృప్తి బాగా పెరిగిపోతే అదే చివరకు వ్యతిరేకంగ మారుతుంది. ఇపుడున్న అసంతృప్తి నిజమే అనుకుందాం. మరి ఆ అసంతృప్తే జగన్ను దింపేసి అర్జంటుగా చంద్రబాబుకు అధికారం అప్పగించాలనేంత బలంగా ఉందా జనాల్లో.

ఇక్కడే చంద్రబాబు తప్పులో కాలేస్తున్నారు. ఎల్లోమీడియాలో కనబడుతున్న అసంతృప్తంతా నిజమే అని చంద్రబాబు భ్రమల్లో బతికేస్తున్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎలాంటి విరోధముందో అంతకుమించి ఎల్లోమీడియా యాజమాన్యాలకుంది. దాంతోనే జనాలందరినీ జగన్ కు వ్యతిరేకం చేయాలని ఎల్లోమీడియా కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగానే 24 గంటలూ 365 రోజులూ కేవలం నెగిటివ్ గానే చూపిస్తోంది. అయితే జనాలు అమయాకులు కాదుకదా. ఎందుకంటే మీడియాకన్నా కొన్నిరెట్లు సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయింది. జనాలకు ఎల్లోమీడియాలో కనబడనది కూడా సోషల్ మీడియాలో కనబడుతోంది. కాబట్టి జనాలు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు.మరింత సమాచారం తెలుసుకోండి: