వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ గెలవటం ఎంత ఇంపార్టెంటో అందరికన్నా చంద్రబాబునాయుడుకే ఎక్కువ తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాల్సిందే అన్న పట్టుదలతో అనేకరకాలుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ప్రచారంపై బాగా దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోను చంద్రబాబే అభ్యర్ధి అన్నట్లుగా టీడీపీ ఇప్పటి నుండే ప్రచారం మొదలుపెట్టింది.





ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా వింగ్ బాగా పాపులర్ చేస్తున్నది. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అభ్యర్ధులు పోటీచేసినా ఓట్లుమాత్రం చంద్రబాబును చూసి మాత్రమే వేయాలన్నట్లుగా సోషల్ మీడియా ప్రచారాన్ని పెంచుతోంది. మామూలుగా అమెరికాలో అయితే అధ్యక్షుడికి జరిగే ఎన్నికల్లో కేవలం అధ్యక్షుడి స్ధానానికి మాత్రమే పోటీ జరుగుతుంది కాబట్టి జనాలు కేవలం అధ్యక్ష స్ధానానికి మాత్రమే ఓట్లేస్తారు.





అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి తనిష్టప్రకారం మంత్రులను తీసుకుంటారు. అయితే మనదగ్గర అలాంటి పద్దతిలేదు. అందుకనే పార్టీల అధినేతలు గెలిచినా మిగిలిన అభ్యర్ధులు గెలవకపోతే చేయగలిగేదేమీ ఉండదు. ఈ పద్దతిలోనే 175 నియోజకవర్గాల్లోను జనాలు అభ్యర్ధిని కాకుండా చంద్రబాబును చూసి మాత్రమే టీడీపీకి ఓట్లేయాలనేట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరీ తరహా ప్రచారం ఎంతవరకు వర్కవుటవుతుందో అనుమానమే. జగన్ ప్రచారం ఒక విధంగా ఉండబోతుంటే టీడీపీ ప్రచారం మరో విధంగా ఉండబోతోందన్నమాట. 




ఎందుకంటే పార్టీకన్నా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల బలాన్ని చూసే జనాలు ఓట్లేయటం మనకు కొత్తేమీకాదు. ఈ పద్దతిలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తుంటారు. పార్టీల తరపున పోటీచేసే అభ్యర్ధులను కాదని స్వతంత్ర అభ్యర్ధిని జనాలు ఎన్నుకున్నారంటేనే వ్యక్తిగత కెపాసిటి మీదే గెలిచినట్లు అనుకోవాలి. మరీ పరిస్ధితుల్లో అన్నీ నియోజకవర్గాల్లో చంద్రబాబే పోటీచేస్తున్నట్లు అనుకుని పార్టీ అభ్యర్ధులకు ఓట్లేసి టీడీపీని గెలిపించండని ప్రచారం చేస్తే సరిపోతుందా ? అన్నది కీలకమైన పాయింట్. మరోవైపేమో జనాల అభిమానాన్ని సంపాదించుకుని ఓట్లేయించుకుని 175కి 175 సీట్లూ గెలవాలని జగన్మోహన్ రెడ్డి సిట్టింగులు, ఆశావహులకు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరి వాదనల్లో జనాలు దేనివైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: