ఏపీలోని పేద ప్రజలకు జగన్ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పారు..అక్టోబరు 15 న ఆరోగ్య శ్రీ జాబితాలోకి ప్రొసీజర్ల చేరిక కార్యక్రమం ఉండనుంది. ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో 2,446 చికిత్సలు ఉండగా, కొత్త వాటి చేరికతో ఆ సంఖ్య 3,254కు చేరనుంది. అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ పైలెట్ ప్రాజెక్ట్ సైతం అక్టోబర్‌లో ప్రారంభించనున్నారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్‌ కార్యాలయంలో జగన్ రివ్యూ చేశారు. ఆరోగ్య శ్రీ, అనుబంధ సేవల కింద చేస్తున్న ఖర్చు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏడాదికి దాదాపు మూడు రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన ప్రొసీజర్లతో ఏడాదికి ఆరోగ్య శ్రీకి సుమారుగా రూ.2,500 కోట్లు, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు, 108, 104లకోసం సుమారు మరో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.


మొత్తంగా దాదాపు రూ.3200 కోట్లు వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. కాగా, మరో 432— 104 వాహనాలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 676 వాహనాలు సేవలందిస్తున్నాయి. అలాగే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 748, 108-వాహనాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. విలేజ్‌ క్లినిక్స్‌లో 12 రకాల వ్యాధి నిర్ధారణ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు..


ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేషెంట్‌ డైట్‌ ఛార్జీలను పెంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ పేషెంట్ల తరహాలోనే రోజుకు రూ.100లకు పెంచాలని సూచించారు. నిశితంగా పరిశీలన చేసి మంచి మెనూ ఇవ్వాలన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ అవార్డుల్లో 6 అవార్డులు ఏపీకి వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం 10 అవార్డుల్లో 6 ఏపీకే వచ్చాయన్నారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది గుర్తింపు అని పేర్కొన్నారు.ఇది తప్పకుండా ప్రజలకు మంచి అవకాశం అని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: