ప్రతి నెల 1 వ తారీఖు వచ్చిందంటే వాణిజ్య పరంగా కొన్ని మార్పులు రావడం సహజం..నేడు అక్టోబర్ 1 న కొన్ని సంస్థలు ప్రజలకు గుడ్ న్యూస్ ను చెప్థున్నాయి.చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను మరోసారి తగ్గించాయి.అక్టోబరు 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.25.50 తగ్గింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర.. ఢిల్లీలో రూ.25.50, కోల్‌కతాలో రూ.36.50, ముంబైలో రూ.35.50, హైదరాబాద్‌లో 36.5 తగ్గింది. ఇప్పుడు తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్‌కు రూ.1885 చెల్లించాలి. గతంలో దీని ధర రూ.1976.50గా ఉండేది.
వాణిజ్య సిలిండర్ ధర తగ్గడం ఇది వరుసగా ఆరోసారి. మే నెలలో రికార్డు స్థాయిలో రూ.2354కి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబరు 1న 91.50 రూపాయలు తగ్గించగా.. ఈ నెలలో మాత్రం 25.50 వరకూ తగ్గింది.ఢిల్లీలో నిన్నటి వరకు రూ.1885గా ఉంటే.. ఇప్పుడు దాని ధర రూ.1859.50కి తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో 1995.50 నుంచి 1959.50కి తగ్గింది, ముంబైలో 1844 నుంచి 1811, చెన్నైలో రూ.2045 నుంచి 2009కి ధరలు తగ్గాయి.. హైదరాబాద్‌లో రూ.36.50 రూపాయలు తగ్గడంతో.. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2099.5 నుంచి రూ.2063కి తగ్గింది. వరంగల్‌లో రూ.2102గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో రూ.2035.5, విశాఖపట్టణంలో రూ.1908.5కి చేరింది.


అదే విధంగా.. హైదరాబాద్‌లో 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.1105 వద్ద స్థిరంగా ఉంది. వరంగల్‌లో రూ.1124గా ఉంది. ఇక ఏపీలోని విజయవాడలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1076.50గా ఉంటే.. విశాఖపట్టణంలో రూ.1068.5 వద్ద స్థిరంగా ఉంది.ఇక ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ 1053 రూపాయలకు లభిస్తోంది. ముంబైలో 1052.50, చెన్నైలో 1068.50 వద్ద స్థిరంగా ఉంది. కోల్‌కతాలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1079కి అందుబాటులో ఉంది..మొత్తానికి ఈ ఒకటో తారీఖున ధరలు భారీగా తగ్గడంతో దసరా పండగ ముందే మొదలైందని జనాలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: