వచ్చే ఎన్నికల్ల తెలుగుదేశంపార్టీ ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి తీరాల్సిన పరిస్ధితి. పొరబాటున మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొస్తే మాత్రం పార్టీని మరచిపోవచ్చు. ఏపీలో కూడా పార్టీ పరిస్ధితి తెలంగాణాలో లాగే అయిపోవటం ఖాయం. ఇదే గనుక జరిగితే పరిస్ధితి ఏమిటో మిగిలిన వాళ్ళకన్నా చంద్రబాబునాయుడుకే ఎక్కువ తెలుసు. అందుకనే గెలుపుకోసం రకరకాలుగా వ్యూహాలు పన్నుతున్నారు.





ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాలో కూడా కొత్త వ్యూహంతో వైసీపీని ఎదుర్కోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇంతకీ కొత్త వ్యూహం ఏమిటంటే కుప్పంతో పాటు కల్యాణదుర్గంలో కూడా పోటీచేస్తే ఎలాగుంటుందని  చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఈ నియోజకవర్గమే ఎందుకంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కల్యాణదుర్గం కూడా ఒకటట. ఎలాగూ హిందుపురంలో నందమూరి బాలకృష్ణ పోటీచేయటం ఇప్పటివరకు గ్యారెంటీనే. చివరినిముషంలో మార్పు ఉండచ్చని కూడా అంటున్నారు. 





కాబట్టి బావ, బావమరుదులు ఇద్దరు ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పోటీచేస్తే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా దాని ప్రభావం పడటం ఖాయమని అనుకుంటున్నారు. కాబట్టి జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే చంద్రబాబు పోటీచేసినంత మాత్రాన మిగిలిన నియోజకవర్గాలు కూడా గెలుస్తుందని అనుకోవటం భ్రమ మాత్రమే. ఎందుకంటే సొంతజిల్లా చిత్తూరులో కుప్పంలో చంద్రబాబు గెలిచినా మిగిలిన 13 నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయిందన్న విషయం తెలిసిందే.





అయితే ఈ  జిల్లాలో మరో సమస్య ఏమిటంటే జేసీ బ్రదర్స్.  వీళ్ళతో ఏగటం కాంగ్రెస్ వల్ల తప్ప ఇంకోపార్టీ వల్లకాదు. వీళ్ళు చంద్రబాబునే లెక్కచేయటంలేదు. అన్నీ నియోజకవర్గాలను కెలికేస్తున్నారు. ఈ జిల్లాలో చంద్రబాబు పోటీచేసినా చేయకపోయినా వీళ్ళతో అయితే పెద్ద సమస్యే. ఎందుకంటే కనీసం ఎనిమిది నియోజకవర్గాల్లో తన మద్దతుదారులను పోటీచేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు సాగకపోతే కంపు చేసేయటం ఖాయం. మరి అనంతపురం జిల్లాను స్వీప్ చేయాలనే చంద్రబాబు వ్యూహం వర్కవుటవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: