నిజంగా ఈ తండ్రి, కొడుకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్ వ్యవహారం భలే విచిత్రంగా ఉంటుంది. ప్రత్యర్ధులపై నోటికొచ్చింది మాట్లాడటంలో వీళ్ళ స్టైలే వేరు. ముందు వెనకా చూసుకోకుండా బూతులు తిట్టేయటం అయ్యన్నపాత్రుడి అలవాటు. తండ్రి బాటలోనే కొడుకు కూడా వెళుతున్నారు. తండ్రిలా బూతులు తిట్టడం సంగతి పక్కనపెట్టేస్తే సోషల్ మీడియాలో  ప్రత్యర్ధులపై చాలా అసభ్యంగా పోస్టులు పెట్టడం, పెట్టించటమే విజయ్ పని.


వీళ్ళపై ఎవరైనా ఫిర్యాదులు చేసినపుడు కేసులు నమోదుచేసుకుని అరెస్టు చేయటానికి పోలీసులు వస్తే ఇద్దరు తప్పించుకుని పారిపోతుంటారు. ఒకపుడు ప్రభుత్వ స్ధలాన్ని ఆక్రమించుకుని ఇంటి ప్రహరీగోడను కట్టిన వివాదంలో పోలీసులను పట్టుకుని అయ్యన్న బూతులు తిట్టేశారు. దానిపై కేసు నమోదుచేసి అరెస్టు చేయటానికి వస్తే తప్పించుకుని పారిపోయారు.


ఇపుడు వైఎస్ భారతిపై టీడీపీ ఐటి సెల్ ఐ టీడీపీ లో అసభ్యంగా పోస్టులు పెట్టటానికి విజయే కారణమని పోలీసులు కేసు బుక్ చేశారు. ఇప్పటికే విజయ్ పై అనేక కేసులున్నాయి. అరెస్టును తప్పించుకోవటానికి విజయ్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇప్పటికి సుమారు 25 సిమ్ కార్డులు మార్చి తన ఆచూకీని తెలీకుండా జాగ్రత్తపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తానికి ఎలాగో పోలీసులు ఆచూకీ పట్టుకుని విజయ్ ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ఇంటికి వెళ్ళారు. పోలీసులను చూడగానే ఇంట్లోని ఆడవాళ్ళని ముందుంచి ఇంటి వెనుకనుండి పారిపోయారట.

తండ్రి, కొడుకుల గురించి వెతుకులాడటంతోనే పోలీసుల ఉద్యోగ జీవితమంతా గడిచిపోయేట్లుంది. ప్రత్యర్ధులను నోటికొచ్చినట్లు తిట్టడం, అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎందుకు అరెస్టులు కాకుండా పోలీసుల నుండి తప్పించుకు తిరగటం ఎందుకు ? మాట్లాడటంలో, పోస్టులు పెట్టడంలో కాస్త సంయమనం పాటిస్తే అసలు ఎవరితోను గొడవే ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రి కొడుకులు ఇద్దరికీ బాగా మంటున్నట్లుంది. అందుకనే జగన్నే కాకుండా వైఎస్ భారతిపైన  కూడా చాలా అసభ్యంగా పోస్టులు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: