ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ ఇప్పుడు ఖాతాదారులకు ఒక అలర్ట్ న్యూస్ ను చెప్పింది.. ఆన్‌లైన్‌ లావాదేవీలను టార్గెట్‌ చేస్తూ కొందరు సైబర్‌ నేరగాళ్లు ఖాతాల్లో ని డబ్బులను కొట్టేయడం తెలిసిందే. అయితే కేటుగాళ్లు రూటు మార్చారు. ఏటీఎమ్‌ల లో నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఏటీఎమ్‌ సెంటర్ల లో కార్డ్‌ వివరాలను కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నే తాజాగా దేశీయ దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది...


అకౌంట్ దారులు నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేదుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై ఏటీఎమ్‌ లో డబ్బులు విత్‌డ్రా చేయాలనుకునే వారు కచ్చితంగా ఏటీఎమ్‌ ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఏటీఎమ్‌ లో డబ్బులు తీసుకునే సమయంలో ఏటీఎమ్‌ పిన్‌తో పాటు ఫోన్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ. 10 వేల కు పైగా విత్‌డ్రా చేయాలనుకునే వారు కచ్చితంగా ఓటీపీ ఎంటర్‌ చేయాలనే నిబంధనను తీసుకొచ్చింది.. ఇలా చేస్తే ఎటువంటి సమస్యలు రావని బ్యాంక్ అధికారులు తెలిపారు.
ఏటీఎమ్‌ లో కార్డు ను ఇన్‌సెర్ట్‌ చేసి అమౌంట్‌ ను ఎంటర్‌ చేయాలి.



అనంతరం కార్డు పిన్‌ ఎంటర్‌ చేయగానే డిస్‌ప్లే పై ఓటీపీ ని ఎంటర్‌ చేయమని మెసేజ్‌ వస్తుంది. ఫోన్‌కి వచ్చిన సదరు ఓటీపీ ఎంటర్‌ చేస్తే డబ్బులు విత్‌ డ్రా అవుతాయి. ఈ నిర్ణయం తో నకిలీ కార్డులను సృష్టించి డబ్బులు కాజేసే వారికి చెక్‌ పడుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది.. ఇలా ఎన్ని రకాల కఠినమైన చర్యలను తీసుకున్నా కూడా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి.. ఇక ఇటీవల ఆర్బీఐ రేపో రేటును పెంచింది.. దాంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ ల పై వడ్డీ రేట్లు కూడా భారీగా పెరిగాయి.. ఇప్పుడు మళ్ళీ ఖాతాదారుల సంఖ్య రెట్టింపు అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: