మాములుగా పండుగలు వస్తే జనాలను ఆకర్షించడానికి కొన్ని కంపెనీలు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తారు.ఇప్పుడు కారును కొనాలని అనుకోనే వారికి ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.లోన్ తీసుకొని కారు కొనెవారికి బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు మంజూరు చేస్తుండడంతోో ఖరీదైన లగ్జరీ కార్లను కూడా చాలా మంది ఈజీగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, కారు లోన్ అనేది హౌసింగ్ లోన్ తర్వాత తీసుకునే పెద్ద రుణంగా చెప్పుకోవచ్చు. మీ ఆదాయం, బడ్జెట్, స్థోమతల ఆధారంగా కారు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


కారు కొనుగోలుదారులు తమ వార్షిక ఆదాయంలో 50 శాతం మాత్రమే కారు కొనుగోలుకు ఖర్చుచేయాలని వారు అంటున్నారు. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అనుకుంటే.. రూ.5 లక్షలు విలువైన కారును కొనుగోలు చేయవచ్చు..రుణం తీసుకునే సమయంలో బ్యాంక్ సిబిల్ స్కోర్, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మాత్రమే తనిఖీ చేస్తుంది. మొత్తం తిరిగి చెల్లించే సామర్థ్యం అంటే మీరు రుణాన్ని తిరిగి చెల్లించగలరా లేదా అని అర్థం. ఇది మొదట బ్యాంక్ ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆపై రుణం కోసం ప్రక్రియతో ముందుకు సాగుతుంది.ఇక్కడ కారు షో-రూమ్ ధరను కాకుండా ఆన్-రోడ్ ధరను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది..


కార్ లోన్లు 3 నుండి 5 సంవత్సరాల కాలానికి అందుబాటులో ఉంటాయి. కొన్ని బ్యాంకులు 7 సంవత్సరాల పాటు రుణాలు ఇస్తున్నాయి. అటువంటి లోన్ కాల వ్యవధి ఎక్కువ.. వాయిదా తగ్గుతుంది. మీరు ఎక్కువ కాలం రుణం తీసుకుంటే, మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాలి. పాత కారు, తక్కువ ఖర్చు అవుతుంది..ఇకపోతే మీరు కారు కొనడానికి బ్యాంక్ కు వెళ్ళినప్పుడు మీరు జీతం పొందుతున్నట్లయితే గత 3 నెలల జీతం స్లిప్, ఆదాయపు పన్ను రిటర్న్ లేదా ఫారం 16 కాపీ, స్వయం ఉపాధి పొందినట్లయితే.. గత 3 సంవత్సరాల ఆదాయపు పన్ను రిటర్న్, CA ధృవీకరించబడిన/ఆడిట్ చేయబడిన గత 3 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ మొదలైనవి అవసరం..


మరింత సమాచారం తెలుసుకోండి: