మనం ఎలా వున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎన్నెన్నో కలలు కంటారు.తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పలు చిన్న మొత్తాల పొదుపు పధకాల్లో పెట్టుబడి పెడుతుంటారు.అయితే ఎటువంటి వాటిలో పెట్టుబడి పెట్టాలి..ఎలా పెట్టాలి..ఎంత లాభం వస్తుంది అనే సందెహాలు రావడం సహజం..దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ) సామాన్యుల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిల్లో కొన్ని తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పాలసీలు ఉన్నాయి.


అందులో ఒకటే ‘ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్’. ఈ పధకంలో పెట్టుబడితే పెట్టారంటే.. మీకు అధిక మొత్తంలో రాబడి రావడమే కాదు.. మీ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మరి ఆ పాలసీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..పిల్లల చదువు, పెళ్లి లాంటి అవసరాలకు ఈ పాలసీ ద్వారా మీరు డబ్బును దాచిపెట్టవచ్చు. అంతేకాకుండా ఈ పాలసీ టర్మ్ వ్యవధిలో పిల్లలకు రిస్క్ కవర్‌ను అందించడమే కాదు.. సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఈ పాలసీని మీరు మీ పిల్లల పేర్ల మీద తీసుకోవచ్చు. వారి వయస్సు 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి.


మీ పిల్లలకు 18, 20, 22 సంవత్సరాలు వయస్సు వచ్చేటప్పటికి బీమా మొత్తంలో 20 శాతం పొందుతారు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణించినట్లయితే.. నామినీకి పెట్టుబడి పెట్టిన డబ్బు.. 105 శాతం రిటర్న్‌తో వస్తుంది. అలా కాకుండా టర్న్ ముగిసేవరకు పాలసీదారుడు బ్రతికే ఉంటే.. మొత్తం డబ్బు 40 శాతం బోనస్‌తో సహా అందుతుంది..మీరు ప్రతీ నెలా రూ. 4500 డిపాజిట్ చేస్తే.. అలాగే పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు అయి ఉంటే, మీరు సంవత్సరానికి రూ. 54 వేలు డిపాజిట్ చేసినట్లు లెక్క. అలాగే మొత్తం వ్యవధి కాలం చూసుకుంటే.. ఆ డబ్బు రూ.6 లక్షల 48 వేలకు చేరుతుంది. ఒకవేళ మీరు ఈ పాలసీని మరో 8 ఏళ్ల పాటు పొడిగించుకుని.. ఇదే మొత్తంలో పెట్టుబడి పెడితే.. చివరికి మీకు వచ్చే మొత్తం 40 శాతం బోనస్‌తో రూ. 20.2 లక్షలను సొంతం చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: