ఈ మధ్య ప్రభుత్వ,ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కూడా తమ కస్టమర్లకు వరుస గుడ్ న్యూసులు చెబుతున్నారు..ఇక ఇప్పుడు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై కీలక నిర్ణయాలను తీసుకుంది.. బల్క్‌ ఎఫ్‌డీలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాల వరకు 6.80శాతం వడ్డీని అందించనుంది. కొత్త రేట్లు నవంబర్ 25, 2022 నుండి అమలులోకి వచ్చాయి.రూ. 2 కోట్ల కంటే ఎక్కువ, 5 కోట్ల రూపాయల లోపు ఉండే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను పెంచింది.


బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 3.75 - 6.50 శాతం మధ్య ఉంటుంది. 15 నెలల నుండి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇప్పుడు గరిష్ట వడ్డీ రేటు 6.80శాతంగా ఉంటుంది..30 రోజుల నుండి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 6 శాతం రేటును ఇస్తోంది.


కాగా, 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు..30, 45 రోజులలో మెచ్యూర్ అయ్యే వాటిపై 4.75శాతం, 46 - 60 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే 61- 90 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 185 రోజుల నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 6 శాతం రేటును ఇస్తోంది. అయితే 2 కోట్ల లోపు డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులను బ్యాంకు ప్రకటించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: