ఏపిలో ప్రతిచిన్న విషయమూ వివాదాస్పదమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టంలేని కొన్నివర్గాలతో పాటు ఎల్లోమీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు రెచ్చిపోతున్నది. ప్రభుత్వ ప్రమేయం ఉన్న విషయాల్లో అయితే  ఏదోలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వానికి సంబంధంలేని విషయాల్లో కూడా జగన్ను వివాదాల్లోకి లాగేసి బురదచల్లేస్తున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే సుప్రింకోర్టు కొలీజియం తెలుగురాష్ట్రాల హైకోర్టుల్లో పనిచేస్తున్న ఐదుగురు జడ్జీలను బదిలీలు చేసింది. ఇందులో ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జీలు ఇద్దరుంటే తెలంగాణా హైకోర్టులో ముగ్గురు జడ్జీలున్నారు. ఏపీలోని బట్టు దేవానంద్ తమిళనాడు హైకోర్టుకు, డీ. రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. బదిలీ చేసిన కొలీజియం బాగానే ఉంది బదిలీ అయినవారు బాగానే ఉన్నారు. మధ్యలో కొందరు లాయర్లకు, గతంలో జడ్జీలుగా పనిచేసిన వారికే సమస్య వచ్చింది.

24 గంటలూ, 365 రోజులూ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడే మాజీ జడ్జి జడ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ రెచ్చిపోయారు. దేవానంద్, రమేష్  పై ప్రభుత్వం సుప్రింకోర్టు, కొలీజియంకు తప్పుడు ఫిర్యాదులు చేసి వీళ్ళని బదిలీచేయించిందని మండిపోయారు. తమకిష్టంలేని జడ్జీలను బదిలీచేయించటం ద్వారా ప్రభుత్వంలోని పెద్దలు ఇతర జడ్జీలను బెదిరిస్తున్నట్లు శ్రవణ్ రెచ్చిపోయారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా దేవానంద్ కోర్టుకు పిలిపించి చివాట్లు పెట్టడాన్ని ప్రభుత్వం సహించలేకపోతోందని ఆరోపించారు. అంటే దేవానంద్ బదిలీకి జగనే కారణమన్నట్లుగా ఆరోపణలు చేశారు. దీంతో ఆగకుండా బదిలీలను వెనక్కు తీసుకోవాలని కొందరు లాయర్లు ధర్నా కూడా చేశారు.

అయితే  ప్రభుత్వంపై శ్రవణ్ చేసిన ఆరోపణలను బార్ అసోసియేషన్లోని కొందరు సీనియర్ లాయర్లు తీవ్రంగా ఖండించారు. జడ్జీల బదిలీకి ప్రభుత్వానికి సంబంధం ఏమిటంటు నిలదీశారు. జడ్జీల బదిలీల వ్యవహారమంతా కొలీజియం చూసుకుంటుందన్న విషయం శ్రవణ్ కు తెలీదా అంటు సీనియర్ లాయర్లు ప్రశ్నించారు. అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటు  లాయర్లు అభిప్రాయపడ్డారు. మొత్తానికి జడ్జీల తాజా బదిలీలపై లాయర్లు రెండువర్గాలుగా విడిపోయారు. విషయం ఏదైనా సరే జగన్ కు ముడిపెట్టి బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్న విషయం అర్ధమవుతోంది.మరింత సమాచారం తెలుసుకోండి: