ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలనే ఉద్దేశ్యం తో జన్ ధన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ అకౌంట్  ఖాతా దారులకు ప్రభుత్వం ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది.జీరో అకౌంట్‌తో తెరిచే సౌకర్యాన్ని కల్పిస్తున్న మోడీ ప్రభుత్వం.. రుణ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ఖాతాదారులకు ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఈ నిర్ణయానికి సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సెబీ, ఆర్‌బీఐల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొత్త పథకం ద్వారా సామాన్య ప్రజలను పెట్టుబడితో అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ యోచన.


 ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు భారీ లబ్ధి పొందనున్నారు. దీనితో పాటు పెట్టుబడికి ప్రోత్సాహకం కూడా ఉంటుంది. రానున్న కాలంలో జన్ ధన్ ఖాతాదారు లను పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రేరేపిస్తుంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మొదటి దశలో ప్రభుత్వం 47 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల ను తెరిచింది. ఈ ఖాతాల్లో దాదాపు 1.75 లక్షల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ డబ్బును ఆర్థిక ఆస్తులతో లింక్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ పథకం ద్వారా రెండో దశలో బ్యాంకు ఖాతాదారుల ను ఆర్థిక ఆస్తులతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.


ఈ పథకం బ్యాంకుకు భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం కోసం సెబీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది త్వరలో అమలులో కి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన రెండవ దశను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది.. ఈ ఖాతాను తెరవాలంటే మీరు మీ సమీపంలో ని బ్యాంకుకు వెళ్లి ఫారమ్‌ ను సమర్పించాలి. భారతదేశం లో నివసించే పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే వ్యక్తి వయస్సు 10 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: