తాజాగా మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు విన్నతర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ పవన్ అన్నదేమంటే ‘నన్నుచూసి ఓట్లేయండి..నాకే ఓట్లేయండి’. ‘వైసీపీతో తేల్చుకోవటానికి నాకు బీజేపీ అవసరమే లేదు’. పవన్ మాట్లాడిన ఈ మాటలపై బాగా చర్చ జరుగుతోంది. నన్నుచూసి ఓట్లేయండి, నాకే ఓట్లేయండి అని జనాలకు పవన్ అప్పీల్  చేయటంలో అర్ధమేంటి ? బీజేపీతో పొత్తున్నపుడు కేవలం పవన్ను చూసి మాత్రమే జనాలు ఎలాఓట్లేస్తారు ? జనసేనకు మాత్రమే ఎందుకు ఓట్లేస్తారు ?





జనసేన అధినేత పవన్ పెద్ద సినీసెలబ్రిటీనే అయ్యుండచ్చు కానీ పవన్ను చూసి మాత్రమే ఓట్లేయమంటే ఎవరు వేయరు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో కూడా జనాలు పవన్ను పట్టించుకోలేదు. పైగా పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడగొట్టారు. అప్పుడే పట్టించుకోని జనాలు వచ్చేఎన్నికల్లో పట్టించుకుంటారా ? ఇక తనకు మాత్రమే ఓట్లేయమని అడగటంలో అర్ధమేంటి ? మిత్రపక్షం బీజేపీకి కూడా ఓట్లేయమని అడగటమే కదా పొత్తుధర్మం.






తనకే ఓట్లేయండి అని అడిగారంటే బీజేపీతో పొత్తులేదని, వేయాల్సిన అవసరంలేదని పరోక్షంగా చెప్పినట్లేకదా ? అంటే తనను టీడీపీతో కలవద్దని ఆంక్షలు విధించిన బీజేపీని తాను వదిలించుకోదలచుకున్నట్లే అర్ధమవుతోంది. తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత టీడీపీతోనే కాదు బీజేపీకి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా ? పైగా తన అడుగులు వ్యూహాత్మకంగా ఉండబోతున్నాయని చెప్పారు. నిజంగానే వ్యూహాత్మకంగా అడుగులు వేసేంత సీన్ పవన్ కుందా అన్నదే పాయింట్.





ఇక వైసీపీతో తేల్చుకునేందుకు బీజేపీ అవసరమే లేదని స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ పవన్ తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకున్నట్లు అర్ధమైపోతోంది. మొదటినుండి పవన్లో సమస్యే ఇది. తనను తాను లార్జర్ దేన్ ది లైఫ్ అన్నట్లుగా ఊహించుకుంటున్నారు. వైసీపీని ఒంటరిగా ఎలా ఎదుర్కోవగలరు ? జగన్ను ఎదుర్కోవటం సాధ్యంకాదని తేలిపోయిన తర్వాతే కదా చంద్రబాబునాయుడుతో చేతులుకలిపింది. మరే ధైర్యంతో ఒంటరిపోరాటానికి దిగుతున్నారో అర్ధంకావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: