ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది లోన్ లు తీసుకొని వ్యాపారం లేదా ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చు కుంటున్నారు.. అయితే ఎవరికీ ఉన్నంతలో వాళ్ళు వారికి తగ్గ లోన్ ను తీసుకుంటారు... ముఖ్యంగా పర్సనల్ లోన్ ను ఎక్కువగా తీసుకొనేవారు. అయితే కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎక్కువ మంది గోల్డ్ లోన్ ను తీసుకుంటున్నారు..గోల్డ్ లోన్స్‌కే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.. గోల్డ్ లోన్‌లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, డాక్యూమెంటేషన్, ప్రాసెస్ టైమ్ పెద్దగా ఉండదు.



నిమిషాల్లోనే అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార అవసరాలు గానీ, ఊహించని ఖర్చులు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం తక్షణ నగదు అవసరమైతే గోల్డ్‌లోన్‌ను ఆశ్రయించడం జరుగుతుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన తరువాత బ్యాంకులు కుదవ పెట్టిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తాయి. ఇందులో రిస్క్ ఏమీ ఉండదు. అయితే, గోల్డ్ లోన్‌పై ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా వడ్డీ రేటు ఉంటుంది. బంగారు రుణాలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తున్న బ్యాంకుల

వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


*.ఇండియన్ బ్యాంక్ – 7.00 శాతం నుంచి మొదలవుతుంది. తీసుకున్న రుణంపై 0.56 % ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.


*. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 7.10% నుంచి 7.20% వరకు ఉంటుంది. 0.75% ప్రాసెసింగ్ ఫీజు.
*. యూనియన్ బ్యాంక్ – 7.25% నుంచి 7.50% వరకు ఉంటుంది.
*.యూకో బ్యాంక్ – 7.40% నుంచి 7.90% వరకు ఉంటుంది. రూ. 250 నుంచి 5,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.
*. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ – 7.60% నుంచి 16.81% వరకు ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు 1 శాతం వరకు ఉంటుంది.


వ్యవసాయయేతర ప్రయోజనాల కోసం గోల్డ్ లోన్స్‌ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు నెలవారీ, త్రైమాసిక వాయిదాలను నిర్ణయించాలి. ఆదాయం, రుణగ్రహీతల రీపేమెంట్ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. అసలు, వడ్డీ వాయిదాలు 90 రోజులకు మించి ఉంటే అటువంటి బంగారు రుణ ఖాతాలను ఎన్‌పీఏ లుగా పరిగణించవచ్చు..ఎదాని కోసం తీసుకున్నా కూడా వడ్డీని సకాలంలో కట్టడం మంచిది..లేకుంటే పెనాల్టీ తప్పక చెల్లించుకోవాల్సి వుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: