డబ్బులను పొదుపు చేసుకోవడానికి ఎన్నో స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పథకాలు చాలా ఎక్కువగా వున్నాయి.అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఒకటి. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల అదిరే రాబడి పొందొచ్చు. కచ్చితమైన లాభం వస్తుంది. ఇంకా పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీరు సిప్ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. లేదంటే ఏడాదిలో ఒకేసారి కొంత మొత్తం పెట్టుబడి పెట్టొచ్చు..


పీపీఎఫ్ స్కీమ్‌లో గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పొదుపు చేసుకోవచ్చు. కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా నెలకు రూ. 12,500 వకు పొదుపు చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి ఆధారపడి ఉంటుంది.. ఇది మంచి పథకం పొదుపు చేసుకునేవారికి ఇది బెస్ట్ అనే చెప్పాలి..ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ వస్తుంది. అందువల్ల వడ్డీ రేటు తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే స్తిరంగా ఉండొచ్చు..


ఇకపోతే ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు నెలకు రూ. 12,500 పొదుపు చేయాలని భావిస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 41 లక్షల వరకు లభిస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 22 లక్షలు అవుతుంది. అంటే మీకు రూ. 18 లక్షలకు పైగా వడ్డీ రూపంలో వస్తోందని చెప్పుకోవచ్చు..పీపీఎఫ్‌లో డబ్బులు పెట్టే వారు లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈఈఈ ట్యాక్స్ బెనిఫిట్ కలిగిన స్కీమ్ ఇది. అంటే పెట్టిన డబ్బులు, వచ్చిన వడ్డీ, తీసుకునే డబ్బులపై పన్ను ఉండదు..


అలాగే మీరు పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూ వెళ్లొచ్చు. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి కూడా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో చేరొచ్చు. మీరు ఎందులో అయినా పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది..ఆటో డెబిట్ ఎంచుకోవడం వల్ల మీ అకౌంట్ నుంచి నెల నెల డబ్బులు కట్ అవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: