సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలు విశేషాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఎలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగిన కూడా అది నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో ఉన్న అన్ని విషయాల గురించి మనకు తెలుసు అని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే వింతైన ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలిసిన తర్వాత ఇలాంటివి కూడా మన దేశంలో ఉన్నాయా అనే ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఎన్నో ప్రాంతాలలో అందరిని ఆశ్చర్యపరిచే ఆచారాలు జనాలు పాటిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఆచారం గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురుగా వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఆశుభంగా భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. అదే నల్ల పిల్లి ఎదురుగా వస్తే ఏదో కీడు జరగబోతుంది అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే పిల్లి ఇలా ఎదురుగా వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్లి నీళ్లు తాగి కాసేపు కూర్చొని మళ్లీ ఇక బయలుదేరడం లాంటిది కూడా దాదాపు అందరూ చేస్తూ ఉంటారు.


 అయితే ఇక్కడ ఉన్న జనాలు మాత్రం పెళ్లి ఎదురు వస్తే అశుభం అనుకోవడం కాదు ఏకంగా పిల్లినే దేవతగా పూజిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. బొక్కలేలే అనే గ్రామ ప్రజలు పిల్లిని దేవత అవతారం అని నమ్ముతూ పూజలు చేస్తున్నారు. పూర్వం ఈ గ్రామంలో దుష్టశక్తులు బీభత్సం సృష్టించాయట. ఈ క్రమంలోనే దేవి మాత మంగమ్మ పిల్లి రూపంలో వచ్చి దుష్ట శక్తులను తరిమి కొట్టిందని.. అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక అప్పటినుంచి పిల్లిని పూజించడం ఆ గ్రామంలో ఆనవాయితీగా వచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat