రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పై పోటీచేయటానికి జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని రెడీ చేశారు. ఇంతకీ ఆ కొత్త అస్త్రం ఎవరంటే మురుగుడు లావణ్య. లావణ్య ఎవరంటే మంగళగిరిలో ఒకపుడు ఎంఎల్ఏలుగా పనిచేసిన  రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ గాను ఎంఎల్ఏగాను పనిచేసిన కాండ్రు కమల కూతురు, మాజీ ఎంఎల్ఏ మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య.

ముందు మాజీ మున్సిపల్ ఛైర్మన్ గంజి చింరిజీవినే పోటీచేయిద్దామని అనుకున్నారు. అయితే సర్వేల్లో గంజికి నెగిటివ్ మార్కులొచ్చాయి. దాంతో చిరంజీవి ప్లేసులో కమలను అభ్యర్ధిగా పోటీచేయిద్దామని అనుకున్నారు. అయితే కమల, హనుమంతరావు కుటుంబాలతో మాట్లాడిన తర్వాత కమల కూతురు లావణ్య అయితే బెస్టుగా ఉంటుందని అనుకున్నారు. అందుకనే మంగళగిరి నియోజకవర్గానికి లావణ్యను సమన్వయకర్తగా జగన్ ఎంపికచేశారు. లావణ్య అభ్యర్ధి అయితే పైన చెప్పిన రెండు కుటుంబాలు, గంజి చిరంజీవితో పాటు ప్రస్తుత ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా గెలుపుకు పనిచేస్తారు.

ఆళ్ళ తప్ప మిగిలిన కమల, హనుమంతరావు, చిరంజీవి అందరూ బీసీల్లోని చేనేత సామాజికవర్గానికి చెందిన వారే. నియోజకవర్గంలో కూడా చేనేత సామాజికవర్గం ఓట్లు సుమారు 50 వేల దాకా ఉన్నాయి. కాబట్టి సొంత సామాజికర్గంలోని ఓట్లలో మెజారిటి తమకే  పడతాయని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అలాగే రెడ్డి, బీసీలు, మైనారిటి, ఎస్సీల్లో కూడా మ్యగ్జిమమ్ ఓట్లు పడితే లావణ్య గెలుపు ఈజీ అని అంచనా వేసుకుంటున్నారు.

ఇదే సమయంలో మంగళగిరిలో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశ్యంతో లోకేష్ కూడా పార్టీ నేతలు, క్యాడర్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. చిరువ్యాపారులు, తోపుడబండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారికి పార్టీ పరంగా సాయం అందిస్తున్నారు. సామాజికవకర్గాలతో సంబంధంలేకుండా అందరు తనను గెలిపిస్తారని అనుకుంటున్నారు. జగన్ పైన వ్యతరేకతే తనను గెలిపిస్తుందని లోకేష్ గంపెడాశతో ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. గెలుపు విషయంలో లాజికల్ గా వైసీపీ, చీకటిలో బాణం వేసినట్లు లోకేష్ ఆశలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: